Thursday, June 6, 2013

శ్రీమద్భాగవతము - భాగము 69

శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 69


యమలార్జన భంజనం

** ఈ లీల మరియు ఉలూకల బంధనం లీల ప్రతీరోజూ స్మరించుకుంటూ ఉండాలి...

తల్లి యశోద కట్టిన కట్లు విడిపించుకోవాలని బలంగా ఆ రోలు లాగితే ఆ 2 చెట్లలోంచి ఇద్దరు మహాపురుషులు వస్తారు...

వారు యక్షులు - వారే కుబేరుని కుమారులైన తలకూవర, మణిగ్రీవులు....

కుబేరుడు చాలా గొప్పవాడు... ఒక్కసారి మాత్రం అమ్మవారిని అమ్మ దృష్ఠితో కాక స్త్రీలాగా చూస్తారు... అందుకే మెల్ల కన్ను వస్తుంది...

కుబేరుడి కుమారులకు  నారదముని శాపం.... (నారదుల వారు పాట పాడుతూ మహతి మీటుతూ శపిస్తారు)

ఒకసారి వారు బట్టలు వేసుకోకుండా స్నానం చేస్తూ నారదమునికి నమస్కరించకపోవటంతో నందవ్రజంలో బట్టలు వేసుకునే అవసరంలేని మద్ది చెట్ల లాగా అవ్వమని ముని శపిస్తారు...

దేవుళ్ళు ఎందుకు కొండ మీదే ఉంటారు... ??

నిలబడిన చోట ఉన్న చెట్టు ఆకులు తుంపి నోట్లో పెట్టుకోవడం - పరమ దరిద్రం

రామకృష్ణ పరమహంస యజమాని నౌకరు కథ....

యజమాని ఒకసారి ఊరికి వెళ్తూ మొత్తం భోగాలను ఆ పెద్ద నౌకరును అనుభవించమనడం...
కానీ.., "ఇది నా యజమానిది" అని గుర్తుపెట్టుకో.... అక్కడే ఉన్న చాపలను మాత్రం పట్టకు అని చెప్పటం....

కొన్ని రోజులకు ఆ నౌకరు చాపలు పట్టబోవడం... యజమాని వచ్చి కట్టుబట్టలతో బయటకు నెట్టివేయడం...

ఈ కథలో యజమాని - దేవుడు..   చాపలు - భక్తులు...
అన్నీ అనుభవించు.... దేవుడిని తలుచుకో.... భక్తుల జోలికి వెళ్ళకు....

గర్భిణీ స్త్రీలు తప్పక వినవలసింది "దశమ స్కంధం"


No comments:

Post a Comment