శ్రీ చాగంటి గారి ప్రవచనములు - శ్రీమద్భాగవతము
భాగము 75
గోపికలు అందరూ కలిసి కృష్ణుడే భర్తగా పొందడానికి వ్రతం చేస్తున్నారు....
మార్గశిర మాసంలో కాత్యాయనీ వ్రతం చేసారు...
అందరూ కలిసి తెల్లవారుఝామున లేచి కాళింది నది/యమునా నదిలో స్నానానికి దిగారు.
కృష్ణుడు గోపికల బట్టలు తీసుకుని దగ్గర పెట్టుకొని చెట్టు ఎక్కుతారు...
కృష్ణుడికి గోపికలకు ఆడవారు స్నానం చేసేటప్పుడు ఏ విధులు పాటించాలో ఈ విధంగా బోధ చేస్తారు...
"మీరు బట్టలన్నీ విప్పి స్నానం చేయడం వల్ల కాత్యాయనీదేవియెడల దోషం వచ్చింది.. నేను చూడని వారా మీరు...నన్నే కదా భర్తగా పొందాలనుకుంటున్నారు..మీ భక్తికి లొంగి శిక్ష వేయకుండా ఉన్నాను.." అన్నారు పరమాత్మ.
** వ్రతం చేసేవారు ఒంటిమీద బట్టలు వేసుకునే స్నానం చెయ్యాలి **
పరమాత్మ వారితో "మీరు చేతులెత్తి నమస్కరించండి.. నేను మిమ్మల్ని అనుగ్రహించి, బట్టలు ఇస్తాను" అంటారు...
మొదట ఒప్పుకోక.. కాసేపటికి చలికి తట్టుకోలేక ఒక గోపిక చెప్పగా అందరూ చేతులెత్తి నమస్కరిస్తారు..
పరమాత్మ వారి వస్త్రములు ఇచ్చి, మీకు వ్రతఫలితాన్ని ఇస్తున్నాను... రాత్రులందు నన్ను పొందగలరు...
చీకటిలో ఈశ్వరుడిని పూజించటమంటే అజ్ఞానమును పారద్రోలటమే అని గుర్తు
గోవింద పట్టాభిషేకము
ఇంద్రుడు ఒకసారి కృష్ణుడేంటీ పరమాత్మ ఏంటి..? వర్షం, ఎండ అంతా నా ఆధీనం అని విర్రవీగుతాడు..
కృష్ణ పరమాత్మ అతడికి బుద్ధి చెప్పాలనుకుని ఇంద్రుడికై వర్షం కురవటానికి యజ్ఞం చేయదలచిన తండ్రి వద్దకు వెళతాడు..
No comments:
Post a Comment