Sunday, July 21, 2013

శ్రీమద్భాగవతము - భాగము 73


శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 73

భూసూక్తములో ఉండే పేర్లు ( భూమి మీద )

గార్ధభాసుర సంహారం ( ధేనుకాసుర వధ ) - బలరాముడు చంపుతారు

గోపబాలురు తాటిపండ్లు అడిగితే బలరాముడు గాడిదను చంపి వారికి తాటిపండ్లను ఇప్పిస్తారు
అప్పుడు గాడిద పిల్లలు వస్తే వారిని కూడా చంపుతారు...

కృష్ణుడు బలరాముని పిలిచి పొగిడి, సేవించి అతనిచేత చంపిస్తారు....

ప్రపంచంలో ప్రతీ జీవి (కుక్క, పక్షి, చెట్టు) పరోపకారం చేస్తూ వెళ్ళిపోతుంది ఒక్క మనిషి తప్ప...

** నీకో విషయం తెలుసు పది మందికి చెప్పు
    నీకు కొంత డబ్బు ఉంది పది మందికి పంచు **


అమ్మకు, భార్యకు థాంక్స్ చెప్పేవాడు, కొడుకుకి విషయాలు చెప్పని తండ్రి ఈ జాతికి బరువు....

గోవులు, గోపబాలురు కాళింది మడుగులో నీరు త్రాగి మరణిస్తారు...
కృష్ణుడి కరుణాదృష్టి వలన నిద్రలోంచి లేచినట్టు లేచి వస్తారు....

కృష్ణుడు ఏంతా చూద్దామని కాళింది మడుగులోకి దూకుతారు...
అలా దూకగానే కాళీయుడు కాటేస్తాడు....చుట్టేసుకుంటాడు...

కృష్ణుడు ఎవరెవరు ఏడుస్తారో చూడాలని చనిపోయినట్టు నటిస్తారు...
గోపికలు, యశోద అందరూ వచ్చి ఏడుస్తూ వరూ దూకడానికి సిద్ధమవుతారు... అప్పుడు కృష్ణుడు పెద్దగా పెరిగిపోతారు... ముక్కుల్లోంచి, నోట్లోనుంచి నెత్తురు కారుతుంది....
అందరూ ఆనందిస్తారు

కాళీయుడి పడగల మీద ఎక్కి నాట్యం చేస్తూ అతడిని చంపబోతారు.....
ఈలోగా కాళీయుని భార్య తన పిల్లలను వెంట పెట్టుకుని శరణు వేడుతుంది...

కాళీయుడు ఎటువంటి తపస్సు చేసాడో, మంచి చేసాడో నీ పాదాలు తన తలమీద పెట్టుకోగలిగారు అని అంటుంది...

Thursday, July 18, 2013

శ్రీమద్భాగవతము - భాగము 72


శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 72


చల్దులు ఏ విధంగా తింటున్నారో చెప్పారు...

కౌమార పౌగండ లీల - కౌమారములో జరిగిన లీల పౌగండమున చెప్పబడినది (గోప బాలుర చేత)

బ్రహ్మ దేవుడు గోవుల్ని, గోపాల బాలురను తన ఒక కనురెప్ప పాటు = ఒక సంవత్సరం పాటు మాయం చేయటం...

కృష్ణుడు తన రూపంలో ఆ సంవత్సరం పాటు గోవుల్ని, గోపాలకులను సృష్టించడం...

చతుర్ముఖ బ్రహ్మ స్తోత్రం చేయడం...

Wednesday, July 17, 2013

శ్రీమద్భాగవతము - భాగము 71


శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 71


అఘాసుర వధ
కొండచిలువ రూపంలో ఉన్న చీకటి అసురుడు - అఘాసురుడు

చల్దులారగించుట



Tuesday, July 2, 2013

శ్రీమద్భాగవతము - భాగము 70


శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 70

అమ్మకు అనుమానం రాకుండా చిన్నపిల్లవానిగా ప్రవర్తించటం...

బకాసుర వధ
వత్సాసుర వధ


కొంగ రూపంలో ఉన్న రాక్షసుడిని (బకాసురుని) వెలగ చెట్టుకు (వత్సాసురునికి) వేసి కొట్టడం....

గర్భిణీ స్త్రీలు...