Monday, May 27, 2013

శ్రీమద్భాగవతము - భాగము 62,63,64,65



శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 62,63,64,65

 

శివరాత్రి ఉత్సవములు/సంగీతం
 

Friday, May 17, 2013

శ్రీమద్భాగవతము - భాగము 61



శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 61

ఉలూకల బంధనం - గొప్ప లీల
గోవింద పట్టాభిషేకం కూడా దీని తర్వాతే......

అమ్మ తనకి పాలు ఇవ్వకుండా పొంగుతున్న పాల వద్దకు వెళ్ళిందన్న కోపంతో స్వామి పాలు,వెన్న కింద పారేసి.... మళ్ళీ అమ్మ కొడుతుంది అనుకుని ఠక ఠక వెన్న ముద్దలు తినేస్తూ.... రెండు ముద్దలు చేత పట్టుకుని పారిపోయారు....

ఒక గోపిక చూసి యశోద పట్టుకోలేదని అందరూ గోపికలు నవ్వడం...
వెనకపడి.... వెంటపడి... వెంటపడి.... ఆఖరికి స్వామి తనంతట తానే దొరికిపోవటం.....

దొరికాక కొట్టలేక కట్టేస్తానని యశోద అనటం....

"తల్లి లక్షణాలు చెప్పారు"
ఎంత కట్టివేయాలని చూసినా కట్టలేక 2 అంగుళములు తక్కువవడం గమనించలేదు యశోదమ్మ.....

ఆఖరికి గట్టిగా కడితే పొట్ట చుట్టూ నల్లటి మచ్చలు పడి "దామోదరా...!" అన్న పేరు వచ్చింది....

2 అంగుళములు తక్కువవడం....
పూజ మొక్కుబడిగా చేయటం....
నేను చేస్తున్నాను...? ఎందుకు చేస్తున్నానో మర్చిపోవటం...
అసలు "అథాంగ పూజ" ఎలా చేయాలో చెప్పారు....

పాము ఏ వేదం చదువుకుంది.....
సాలెపురుగు ఏ శాస్త్రం చదువుకుంది...
భగవంతుడు భక్తికి లొంగుతాడు....



Monday, May 13, 2013

శ్రీమద్భాగవతము - భాగము 60



శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 60


నందవ్రజంలో దుర్గమ్మ మరియు కృష్ణుడు ఇద్దరూ అర్థరాత్రి పుట్టారు......

లింగాభిషేకం చేసేప్పుడు కళ్ళు మూసుకుని ఎలా ధ్యానించాలి...?


శివలింగం చల్లగా ఉంటే లోకమంతా చల్లగా ఉంటుంది...

కృష్ణుడు మట్టి తినడం.....

"మన్ను తినంగ నేను శిశువునో....."

విశ్వరూప సందర్శనం

పరీక్షిత్తు అడుగుతాడు "నందుడు, యశోద ఏమి పుణ్యం/తపస్సు చేసారు అంత అదృష్టం పొందడానికి...? "


శుకుడు చెప్తాడు "వారు ఏమీ చెయ్యలేదు. కృష్ణుడు జన్మించబోతున్నాడని దేవతలలో తారా....ను భూలోకంలో జన్మించమంటారు"

Sunday, May 12, 2013

శ్రీమద్భాగవతము - భాగము 57,58,59




శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 57,58,59

 

మహాశివరాత్రి పూజలు

Tuesday, May 7, 2013

శ్రీమద్భాగవతము - భాగము 56***



శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 56


పోతనగారి ఫొటో ఒక్కటీ లేదు

అందరి ఇంటికి వెళ్ళి వెన్న, నెయ్యి తినేసి ఇంటికి వచ్చే ముందు మూతి తుడుచుకుని ఆకలి అంటూ వచ్చేవారు....

*** కృష్ణుడి చోరలీల ***

ఎప్పుడూ వెన్న, నెయ్యి మాత్రమే తింటారు

** వెన్నే ఎందుకు ?? **


నిర్మలమైన మనస్సు - పాలు
మనంతట మనం దేవునికి నిర్మలమైన మనస్సుతో పురాణాలు చదివి/విని దగ్గరవ్వాలి

పాలు అగ్ని మీద పెట్టి కాచాలి.....
మన నిర్మలమైన మనస్సును భక్తి వలన ఈశ్వర కైంకర్యం చేసి వైరాగ్య భావనతో ఉండాలి....

పెరుగు అవ్వాలంటే పెరుగునే తోడుగా వెయ్యాలి....
అంటే గురువు వద్దకు వచ్చి చెప్పమని అడగాలి.....

అప్పుడు పెరుగు తోడుకుంటుంది....
గురువు చేసిన ఉపదేశం చక్కగా కుండలో పెట్టినట్టు మనస్సులో పెట్టాలి.....

పెరుగు చిలికినట్టు గురువు చెప్పిన మాటలు
మనస్సులో మననం చేస్తునట్టు తిప్పాలి...

అలా తిప్పితే వచ్చేది వెన్న - Bookish Knowledge

దాన్ని అగ్నిహోత్రంలో పెట్టి కాస్తే వచ్చేదే నెయ్యి - అదే బ్రహ్మజ్ఞానాన్ని పొందవచ్చు

కానీ మరల నెయ్యి/వెన్నను పాలు చేయలేం...

దూడను తాగనీయకుండా మనమె పట్టేసుకుంటాం పాలు - ఎంత క్రౌర్యం

కృష్ణుడి గురించి అందరూ వచ్చి ఫిర్యాదులు చేయడం , నేరాలు చెప్పడం

కృష్ణ లీలలు - చోర లీల

ఏమి చెయ్యాలో ఎప్పుడు చెయ్యాలో ఏమి చేయకూడదో ఎప్పుడు చేయకూడదు అనేవి ఈ లీల ద్వారా తెలుస్తుంది.....

Wednesday, May 1, 2013

శ్రీమద్భాగవతము - భాగము 55

శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 55


అరుణాచలం వెళ్తేనే చాలు కోటి జన్మల పుణ్యం

అరుణాచలం - అగ్ని లింగం - శివరాత్రినాడు ఉద్భవించినది

తృణావర్తోపాఖ్యాణం

తృణము - తృష్ణ - తృప్తి

"తృప్తి ఉంటే తృష్ణ పట్టుకోలేదు మనల్ని"

***** తప్పక చదవవలిసిన భాగాలు *****
పోతనగారి భాగవతం
కృష్ణ కర్ణామృతం


కృష్ణుడి బుడిబుడి అడుగులు