Thursday, June 12, 2014

శ్రీమద్భాగవతము - భాగము 84


శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 84


రుక్మిణీ కళ్యాణం రోజు ఒక ఆవు పూలు పెట్టుకుని వచ్చిన సందర్భం గురించి మాట్లాడారు 


Friday, February 21, 2014

శ్రీమద్భాగవతము - భాగము 81, 82, 83


శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 81, 82, 83 



రుక్మిణీ  కళ్యాణం జరిపించారు


శ్రీమద్భాగవతము - భాగము 80


శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 80




రుక్మిణీ  కళ్యాణం

కృష్ణుడు రుక్మిణిని తీసుకెళ్ళడం...

రుక్మిని చంపకుండా ముండనం చేయటం....

రుక్మిణిని రాక్షస వివాహము చేసుకోవడం 

Sunday, January 5, 2014

Sunday, December 29, 2013

శ్రీమద్భాగవతము - భాగము 78

శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 78



కృష్ణ బలరాములు కంసుడి నగరం చేరుకుని విశ్రమిస్తారు....

ఒక చాకలి పట్టుబట్టలు పట్టుకెళుతుంటే పరమాత్మ పిలిచి బట్టలు అడిగారు...

అందుకు చాకలి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే "అన్నయ్యా ...! ఈ పుర్రె మారదు" అంటూ తల బద్దలుకొట్టి చంపుతారు..

ఆ చాకలి - త్రేతాయుగం సీతమ్మ వారి మీద నింద వేసినవాడు 

కృష్ణుడు బలరామునితో కలిసి వెళుతుండగా ఒక బట్టలు నేసే అతను పిలిచి బట్టలిచ్చారు... ఒక మాల కట్టే అతను పిలిచి మాల అలంకరించారు... అందుకు పరమాత్మ సంతోషించి "వరము నువ్వు అడుగు నేను ఇస్తాను" అంటే 

" నీ పాద కమల సేవయు...... " అని అడుగుతారు. పరమాత్మ వరమిస్తారు.

అంత్యమున వారందరికీ మోక్షం కలిగిస్తారు....

తరువాత ఒక త్రివక్ర (3 వక్రములు కలినినామె) "నాకు అందం లేదు... నువ్వు ఈ చందనం రాసుకో ... అందరికీ ఉండమంటే ఉంటుందా ..?? " అంటూ చందనం ఇస్తుంది.

కృష్ణుడు ఆమె పాదాన్ని తన పాదంతో తొక్కగానే ఆమె సౌందర్యవతి అయ్యి... సౌఖ్యమిస్తాను రమ్మంటుంది...

ఆమె సైరంధ్రి ( అంటే  పురుషులు అడగడమే తడువు వారికి కావలిసిన సౌఖ్యాన్ని ఇస్తారు )

"అలాగే కంస సంహారం తరువాత (అజ్ఞానం పోయాక) వస్తాను.... నేను పాంధుడను (ఇల్లు లేనివాడిని) " అంటారు స్వామి...

ముందుకు వెళ్ళి కంస పరివారాన్ని (సైన్యాన్ని) చంపుతారు ..

కంసుడికి భయం వేసి "కువలయాపాలకం" అనే ఏనుగును పంపిస్తాడు...

దాన్నీ చంపుతారు పరమాత్మ .... 

మల్ల యోధులతో యుద్ధము... కంస సంహారము...

జరాసంధుడు చెడ్డవారిని పోగేసి కృష్ణుడి మీదకు యుద్ధానికి వస్తాడు...

అలా 17 సార్లు జరాసంధుడిని చంపక అతడు తెచ్చే అక్షౌహిణీల సైన్యమును చంపుతారు....
18వ సారి ద్వారకకి ఏమవుతుందో అని సముద్రంలో చోటు అడిగి ద్వారక నిర్మిస్తారు...

నారదుల వారు కాలయమనుడిని (యాదవుల చేతిలో చావడు) పిలిచి కృష్ణుడి మీద యుద్ధానికి వెళ్ళమంటే... వెళ్తాడు...

అతడిని చూసి పారిపోతుంటారు కృష్ణుల వారు... అతడు వెంబడించి, వెంబడించి ఒక గుహలోకి వచ్చి, పడుకున్న వాడిని లేపితే వాడు చంపుతాడు (అతడే ముచికుందుడు)

మళ్ళీ జరాసంధుడు వెంబడిస్తే బలరామకృష్ణులు పారిపోతారు... పారిపోయి ఒక పర్వతంలోకి వెళ్ళిపోతారు... చీకట్లో కనపడకపొతే జరాసంధుడు ప్రవర్ధన పర్వతాన్ని కాల్చమని -- చనిపోయారనుకుని వెళ్ళిపోతాడు...

వారిద్దరూ ప్రక్కన సముద్రంలోకి దూకి ద్వారకకు ఈదుకుంటూ వెళ్తారు...

దశమ స్కంధం పూర్వోత్తర భాగాలు...

పూర్వ భాగము "రుక్మిణీ కళ్యాణం" వరకు చెప్తారు

Thursday, December 26, 2013

శ్రీమద్భాగవతము - భాగము 77

శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 77



రాసలీలా ఘట్టము

శరత్కాల పొర్ణమి రాత్రి వేణుగానం చేసారు స్వామి 

ఆ వేణుగానానికి కొంతమంది గోపికలు అక్కడికక్కడే మరణిస్తారు. మరికొంత మంది గోపికలు పరవశించి భర్త, అత్తమామలను , కొడుకులు వద్దంటున్నా వినకుండా కృష్ణుడితో రాసలీల చేయాలని వస్తే పరమాత్మ మందలిస్తారు....

అందుకు గోపికలు "నువ్వు అలా అనడం భావ్యం కాదు కృష్ణా...! " అంటారు 

** గోపికలకు వేణునాదం వింటే "అనంగవర్ధనం" అయింది ***

అనంగవర్ధనం అంటే - కామ ప్రేరేపణ  ; అనంగ - శరీరం లేని - మన్మధుడు 

కానీ అనంగవర్ధనం అంటే అసలు అర్థం "దేవుడి నుంచి పిలుపు వినపడడం"

"మీరు ఇలా రావడం తగదు, వెళ్ళిపోండి " అంటారు పరమాత్మ.
అందుకు గోపికలు " మేము ఎన్నో జన్మల తపస్సు వల్ల నిన్ను తెలుసుకోగలిగాము, మేము మళ్ళీ పతుల దగ్గరకు వెళ్ళము, మాకు మోక్షం ఇవ్వు" అని అడుగుతారు 

గోపికలు మేము ఆనందిస్తున్నాము అనుకోగానే కృష్ణుడు మాయమవుతారు. గోపికలు కృష్ణుడేడీయని చెట్లను, పుట్టలను అడుగుతారు.

పరమాత్మ నెమలిపింఛం పెట్టుకుంటారు... 

*** నెమలి సంపర్కం లేకుండా పిల్లలను కంటుంది... వసంత ఋతువులో నెమలి నాట్యం చేస్తూ కంటిలోంచి నీరు కారిస్తే , ఆ నీరు తాగి ఆడ నెమలి గర్భం దాలుస్తుంది  ***

పరమాత్మ రాసలీల చేసి వెళ్ళిపోతారు 

నారదుల వారు వచ్చి కంసుడికి కృష్ణ ఆచూకీ చెప్తారు...

కంసుడికి తన తల్లితండ్రుల వల్ల వచ్చిన శాపం  "నీ వాళ్ళందరూ నిన్ను ద్వేషిస్తారు" అని 

కంసుడు అక్రూరుడిని పిలిచి కృష్ణ బలరాములను "మీ మావయ్య యాగం చేస్తున్నారని" పిలవమంటారు 

అక్రూరుడు తన భాగ్యానికి సంతోషించి కంసుణ్ణి మెచ్చుకుంటారు ...

కృష్ణుడి వద్దకు వెళ్ళి విషయం చెప్తే , కృష్ణ బలరాములు తమను అడ్డుపడిన పరివారమును, గోపికలను మందలించి బయలుదేరుతారు ...

అక్రూరుడికి సంధ్యావందనం చేసుకుంటుండగా ఆదిశేషుడిలా దర్శనం ఇస్తారు పరమాత్మ 

కాలు మీద కాలు వేసి రుద్దడం - దరిద్రం - అది దేవతలను అవమానించినట్టే .... అందుకే మన పెద్దవాళ్ళు కాలు మీద కాలు వేసి కడుక్కోవద్దు అని చెబుతుండేవారు 




Tuesday, December 10, 2013

శ్రీమద్భాగవతము - భాగము 76

శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 76


శ్రీకృష్ణుడు తండ్రితో ఇంద్రయాగం వద్దు గోవర్ధనగిరి యాగం చేయమని చెప్తారు

"కల్పము చెప్పటానికి ఏ బ్రహ్మ వస్తారు?" అని అడుగగా ఎవరూ రానవసరం లేదు ఆ యాగానికి ఏమేమి చేస్తారో దీనికి కూడా అవే చేయమని చెప్తారు 

యాగం చేసి అందరూ , ఆవులు , దూడలతో సహా కలిసి కూర్చుని భుజించి, గోవర్ధనగిరికి ప్రదక్షిణ చేసి , మిగిలిన పదార్ధాలు అన్నీ గోవర్ధనగిరికి సమర్పించమని చెప్తారు

మరుసటి రోజు అందరూ కలిసి అలాగే చేస్తారు...

గోవిందుడు వచ్చి ఆరగించటం చూసి సంతోషిస్తూ స్తోత్రాలు చేస్తూ ప్రదక్షిణ చేస్తుంటారు

ఆ కోలాహలం విన్న ఇంద్రుడు విషయం తెలిసి కోపంతో ఉరుములు , మెరుపులతో కూడిన వర్షం కురిపిస్తారు 

ఆ వర్షానికి ఆవులు,దూడలు భీతిల్లిపోయి కొన్ని చనిపోగా అందరూ కృష్ణుడిని వేడుకుంటారు 

వెంటనే కృష్ణుడు గోవర్ధనగిరి ఎత్తి పట్టుకుంటారు 

అలా 7 రాత్రులు 7 పగళ్ళు 7 ఏళ్ళ వయస్సులో తన చూపులతో పోషించారు 

" నేను బాలుడిని, ఇంత కొండ మొయ్యలేనేమో అని భయపడకండి, బంధువులారా.... రండి  కొండ క్రిందకు"  అని పిలిచారు 

ఇంద్రుడు అడిగారు "ఎరా...! ఎంతమంది పడ్డారు ?? " . సహచరుడు "ఒక్కరూ పడలేదు ... సుఖంగా ఉన్నారు ..." అని చెపుతాడు 

ఇంద్రుడికి అనుమానం వచ్చి వర్షాన్ని ఆపిస్తారు . పరమాత్మ దగ్గరకి వచ్చి చూసే సరికి దర్శనం ఇస్తారు 

ఇంద్రుడు "ఎంత పొరపాటయిపోయింది క్షమించమంటారు " 

ఐరావతం వచ్చి ఆకాశగంగను అభిషేకం చేసింది 

కామధేనువు వచ్చి "మేము ఇవ్వటం కాదు నువ్వు గెలుచుకున్నావు గోవులను సంరక్షించుకొనటం వలన "గోవిందా" అను పేరు" అని అంటుంది 

ఇంద్రుడి తల్లి వచ్చి ఇంద్రుడిని తిట్టి "ఆనాడు నిన్ను వామనమూర్తిలా వచ్చి కాపాడాడు ... ఈ రోజు నువ్వు చేసిన తప్పును క్షమించాడు .... అభిషేకం చెయ్యి" అని అంటుంది 

ఇంద్రుడు పాలతో అభిషేకం చేస్తారు...

కామధేనువు పాలను వర్షిస్తుంది...