Saturday, April 27, 2013

శ్రీమద్భాగవతము - భాగము 54



శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 54

 
బోర్ల పడిన చిన్ని కృష్ణుడు

అందరూ ఆనందంతో విందు చేసుకుంటుండగా బండిని తన్నిన చిన్ని కృష్ణుడు

షటకాసుర వృత్తాంతం

Friday, April 26, 2013

శ్రీమద్భాగవతము - భాగము 53



శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 53


కంసుడికి మరణం రాకూడదు అనే భయం పట్టుకోవడం....

పూతన సంహారం - పాలు ఇవ్వడానికి వచ్చి విషపు పాలు ఇవ్వడం

పూతన బాలఘాతకి  - తను చనిపోయాక కాలిస్తే సువాసన రావటం

Wednesday, April 24, 2013

శ్రీమద్భాగవతము - భాగము 52



శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 52


శ్రీకృష్ణుడి జననం

వసుదేవుడు బిడ్డని తీసుకెళ్ళి యశోదాదేవి వద్ద వదిలి, ఆడపిల్లను తీసుకురావడం....

తీరిన కోరికల వల్ల కలిగే సుఖము
                   +
తీరని కోరికల వల్ల కలిగే దు:ఖము
                   =
                జీవితం

Sunday, April 21, 2013

శ్రీమద్భాగవతము - భాగము 51***



శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 51


దశమ స్కంధం -- ఆయువుపట్టు
ప్రతి ఒక్కరు జీవితంలో వినవలసిన భాగం - దశమ స్కంధం

ఈ భాగంలో - 9:00నిమిషాల నుంచి - 10:30 నిమిషాల వరకు రామాయణం 2నిమిషాలలో చెప్పారు

నవమ స్కంధంలో రామాయణం చెప్పి దశమ స్కంధం ప్రారంభించారు


****** అనుమానం - పురాణం****** 

(ఏ అనుమానం వస్తే ఏ పురాణం చూడాలి)
రామాయణంలో సందేహం - పద్మ పురాణం
వెంకటేశ్వర స్వామి సందేహం - భవిష్యత్తు/వరాహ పురాణం
శివుని గురించి తెలుసుకోవాలంటే - స్కాంధ పురాణం
భాగవతంలో అనుమానం వస్తే - దేవీ భాగవతం

కంసుడికి ఉన్న పూర్వ జన్మ శాపం - ఇది దేవిభాగవతం అంతర్గతం


దేవకీ దేవి కడుపులో పుట్టిన 7గురికి ఉన్న శాపం

గర్భిణీ స్త్రీలకు వచ్చే వికారాలు, కోరికల గురించి పద్యం చెప్పారు... 

(ఆఖరి 2ని||లు)

Saturday, April 20, 2013

శ్రీమద్భాగవతము - భాగము 49 & 50




శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 49 &50

 

అంబరీషోపాఖ్యాణం
దూర్వాసుడు అంబరీషునికి శాపం పెట్టడం....
అంబరీషుడు సంవత్సరం పాటు ఏకాదశి వ్రతం చేసుకోవడం.....
ఏకాదశి వ్రతం చేసి దూర్వాసుడికి భోజనం పెడదామనుకోవడం....
అతడు ఆలస్యం చేసి ద్వాదశి తిథి వస్తుందనగా వస్తారు....
ఇంతలో అంబరీషుడు ఋషులని అడిగి నీరు పుచ్చుకోవడం....
అందుకు దూర్వాసుడికి కోపం వచ్చి జట తీసి అంబరీషుడి పైకి వదలటం....
వెంటనే అక్కడే శ్రీహరి కాపలా పెట్టిన సుదర్శన చక్రం దూర్వాసుడి వెంట పడటం...
దానితో ఆయన ముల్లోకాలు తిరగటం.... (ఇది అతనికి మావగారి శాపం)
అలా తిరిగి తిరిగి శ్రీహరి వద్దకు రావటం...
శ్రీహరి దూర్వాసుడిని అంబరీషునికి శరణాగతి చేయమనటం... అతడట్లే చేయటం...
అంబరీషుడు తన వల్ల ముని ఇంత కష్టపడాల్సి వచ్చిందని ఎంతో బాధపడి..... చక్రానికి శరణాగతి చేసి మునిని వదిలేయమని ప్రార్థిస్తారు....

కోడలిని ఎలా చూసుకోవాలో 50:00 నిమిషం వద్ద 5 నిమిషాల పాటు చెప్పారు...

దూర్వాసుడు గర్భంలో ఉన్నప్పుడు ఒక రాక్షసుడు పెట్టిన చికాకు వల్ల ఆయన పరమకోపంతో పుడతారు...
ఆ కోపాగ్నికి రాక్షసుడు భస్మం అవుతాడు... కానీ ఆ కోపాగ్ని అలాగే ఉండిపోతుంది...

దూర్వసుడికి మావగారి శాపం :

ఒకసారి దూర్వాసుడు ముని వద్దకు వెళ్ళి తన కుమార్తెను ఇమ్మని కోరతాడు...
అందుకు ఆ ముని "నీకు కోపం ఎక్కువ... నీకు కోపం వస్తే నా కూతురిని ఏదైనా చేస్తావు... ఇవ్వను" అంటారు.....

అలాక్కాదని ఒప్పించి వివాహమాడతారు...
ఒక రోజు ఎందుకో కోపం వచ్చి ఆమెని కన్నెర్ర చేసి చూస్తే ఆమె బూడిదయిపోతుంది...
వెంటనే ఆమెకు వరమిస్తాడు "నువ్వు ఎన్నటికీ అంతరించవు" అని
ఆమె అరటి చెట్టుగా పుడుతుంది...
తరువాత ఒక రోజు తండ్రి వచ్చి విషయం గ్రహించి శపిస్తారు.....

Friday, April 19, 2013

శ్రీమద్భాగవతము - భాగము 47 & 48




శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 47 & 48


వామనావతారం
అదితి - కశ్యపుల పుత్రుడు - వామనుడు

Thursday, April 18, 2013

శ్రీమద్భాగవతము - భాగము 46


శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 46


భార్యతో భర్త ప్రవర్తించే/ప్రవర్తించవలసిన తీరు............
నాయకత్వం ఆవశ్యకత...
శివునికి మోహిని గురించి ప్రమథగణాలు తెలుపుట....
శివుడు మోహినిని చూడదలుచుకోవటం...
శివుడు విష్ణువు వద్దకు వెళ్ళి మోహిని అవతారం చూపమనటం....
శివుడు మోహినిని చూడటం.... వెంటపడటం.... వీర్యం పడి వెండి, బంగారం అవటం....
శివకేశవులకు అయ్యప్పస్వామి జననం.........

Wednesday, April 17, 2013

శ్రీమద్భాగవతము - భాగము 45




శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 45

 

మోహిని రూపం........
అమృతం పంచిపెట్టడం.....

Tuesday, April 16, 2013

శ్రీమద్భాగవతము - భాగము 44


శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 44

 

"క్షీరాబ్ది కన్యకకు......" గానం

Sunday, April 14, 2013

Monday, April 1, 2013

శ్రీమద్భాగవతము - భాగము 42***



శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 42




లక్ష్మీ కళ్యాణం

నలుపు నాణ్యత

ఆడవారు కానీ, మగవారు కానీ లక్ష్మీ ఆవిర్భావం, లక్ష్మీ కళ్యాణం చదువుకుంటే చాలా మంచిది....

ముదివర్తి కొండమాచార్యులు గారు ద్విపద రాసారు .... అది చదివినా చాలు..

(చాగంటిగారి సైటులో ఉంది)

"పాలమున్నీటిలో....." 


తప్పక వినవలసిన భాగం --> లక్ష్మీ కళ్యాణం 

అందరూ అమ్మవారి తరుఫున ఉండి ఒక గడుసుపిల్ల స్వామిని ఏడిపిస్తే శివుని భార్య అయిన "పార్వతి" వచ్చి "మా తమ్ముడిని అంతమాట అంటావా....?" అంటూ ఎరుపు, నలుపు రంగుల గురించి చెప్తుంది...