Sunday, December 29, 2013

శ్రీమద్భాగవతము - భాగము 78

శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 78



కృష్ణ బలరాములు కంసుడి నగరం చేరుకుని విశ్రమిస్తారు....

ఒక చాకలి పట్టుబట్టలు పట్టుకెళుతుంటే పరమాత్మ పిలిచి బట్టలు అడిగారు...

అందుకు చాకలి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే "అన్నయ్యా ...! ఈ పుర్రె మారదు" అంటూ తల బద్దలుకొట్టి చంపుతారు..

ఆ చాకలి - త్రేతాయుగం సీతమ్మ వారి మీద నింద వేసినవాడు 

కృష్ణుడు బలరామునితో కలిసి వెళుతుండగా ఒక బట్టలు నేసే అతను పిలిచి బట్టలిచ్చారు... ఒక మాల కట్టే అతను పిలిచి మాల అలంకరించారు... అందుకు పరమాత్మ సంతోషించి "వరము నువ్వు అడుగు నేను ఇస్తాను" అంటే 

" నీ పాద కమల సేవయు...... " అని అడుగుతారు. పరమాత్మ వరమిస్తారు.

అంత్యమున వారందరికీ మోక్షం కలిగిస్తారు....

తరువాత ఒక త్రివక్ర (3 వక్రములు కలినినామె) "నాకు అందం లేదు... నువ్వు ఈ చందనం రాసుకో ... అందరికీ ఉండమంటే ఉంటుందా ..?? " అంటూ చందనం ఇస్తుంది.

కృష్ణుడు ఆమె పాదాన్ని తన పాదంతో తొక్కగానే ఆమె సౌందర్యవతి అయ్యి... సౌఖ్యమిస్తాను రమ్మంటుంది...

ఆమె సైరంధ్రి ( అంటే  పురుషులు అడగడమే తడువు వారికి కావలిసిన సౌఖ్యాన్ని ఇస్తారు )

"అలాగే కంస సంహారం తరువాత (అజ్ఞానం పోయాక) వస్తాను.... నేను పాంధుడను (ఇల్లు లేనివాడిని) " అంటారు స్వామి...

ముందుకు వెళ్ళి కంస పరివారాన్ని (సైన్యాన్ని) చంపుతారు ..

కంసుడికి భయం వేసి "కువలయాపాలకం" అనే ఏనుగును పంపిస్తాడు...

దాన్నీ చంపుతారు పరమాత్మ .... 

మల్ల యోధులతో యుద్ధము... కంస సంహారము...

జరాసంధుడు చెడ్డవారిని పోగేసి కృష్ణుడి మీదకు యుద్ధానికి వస్తాడు...

అలా 17 సార్లు జరాసంధుడిని చంపక అతడు తెచ్చే అక్షౌహిణీల సైన్యమును చంపుతారు....
18వ సారి ద్వారకకి ఏమవుతుందో అని సముద్రంలో చోటు అడిగి ద్వారక నిర్మిస్తారు...

నారదుల వారు కాలయమనుడిని (యాదవుల చేతిలో చావడు) పిలిచి కృష్ణుడి మీద యుద్ధానికి వెళ్ళమంటే... వెళ్తాడు...

అతడిని చూసి పారిపోతుంటారు కృష్ణుల వారు... అతడు వెంబడించి, వెంబడించి ఒక గుహలోకి వచ్చి, పడుకున్న వాడిని లేపితే వాడు చంపుతాడు (అతడే ముచికుందుడు)

మళ్ళీ జరాసంధుడు వెంబడిస్తే బలరామకృష్ణులు పారిపోతారు... పారిపోయి ఒక పర్వతంలోకి వెళ్ళిపోతారు... చీకట్లో కనపడకపొతే జరాసంధుడు ప్రవర్ధన పర్వతాన్ని కాల్చమని -- చనిపోయారనుకుని వెళ్ళిపోతాడు...

వారిద్దరూ ప్రక్కన సముద్రంలోకి దూకి ద్వారకకు ఈదుకుంటూ వెళ్తారు...

దశమ స్కంధం పూర్వోత్తర భాగాలు...

పూర్వ భాగము "రుక్మిణీ కళ్యాణం" వరకు చెప్తారు

Thursday, December 26, 2013

శ్రీమద్భాగవతము - భాగము 77

శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 77



రాసలీలా ఘట్టము

శరత్కాల పొర్ణమి రాత్రి వేణుగానం చేసారు స్వామి 

ఆ వేణుగానానికి కొంతమంది గోపికలు అక్కడికక్కడే మరణిస్తారు. మరికొంత మంది గోపికలు పరవశించి భర్త, అత్తమామలను , కొడుకులు వద్దంటున్నా వినకుండా కృష్ణుడితో రాసలీల చేయాలని వస్తే పరమాత్మ మందలిస్తారు....

అందుకు గోపికలు "నువ్వు అలా అనడం భావ్యం కాదు కృష్ణా...! " అంటారు 

** గోపికలకు వేణునాదం వింటే "అనంగవర్ధనం" అయింది ***

అనంగవర్ధనం అంటే - కామ ప్రేరేపణ  ; అనంగ - శరీరం లేని - మన్మధుడు 

కానీ అనంగవర్ధనం అంటే అసలు అర్థం "దేవుడి నుంచి పిలుపు వినపడడం"

"మీరు ఇలా రావడం తగదు, వెళ్ళిపోండి " అంటారు పరమాత్మ.
అందుకు గోపికలు " మేము ఎన్నో జన్మల తపస్సు వల్ల నిన్ను తెలుసుకోగలిగాము, మేము మళ్ళీ పతుల దగ్గరకు వెళ్ళము, మాకు మోక్షం ఇవ్వు" అని అడుగుతారు 

గోపికలు మేము ఆనందిస్తున్నాము అనుకోగానే కృష్ణుడు మాయమవుతారు. గోపికలు కృష్ణుడేడీయని చెట్లను, పుట్టలను అడుగుతారు.

పరమాత్మ నెమలిపింఛం పెట్టుకుంటారు... 

*** నెమలి సంపర్కం లేకుండా పిల్లలను కంటుంది... వసంత ఋతువులో నెమలి నాట్యం చేస్తూ కంటిలోంచి నీరు కారిస్తే , ఆ నీరు తాగి ఆడ నెమలి గర్భం దాలుస్తుంది  ***

పరమాత్మ రాసలీల చేసి వెళ్ళిపోతారు 

నారదుల వారు వచ్చి కంసుడికి కృష్ణ ఆచూకీ చెప్తారు...

కంసుడికి తన తల్లితండ్రుల వల్ల వచ్చిన శాపం  "నీ వాళ్ళందరూ నిన్ను ద్వేషిస్తారు" అని 

కంసుడు అక్రూరుడిని పిలిచి కృష్ణ బలరాములను "మీ మావయ్య యాగం చేస్తున్నారని" పిలవమంటారు 

అక్రూరుడు తన భాగ్యానికి సంతోషించి కంసుణ్ణి మెచ్చుకుంటారు ...

కృష్ణుడి వద్దకు వెళ్ళి విషయం చెప్తే , కృష్ణ బలరాములు తమను అడ్డుపడిన పరివారమును, గోపికలను మందలించి బయలుదేరుతారు ...

అక్రూరుడికి సంధ్యావందనం చేసుకుంటుండగా ఆదిశేషుడిలా దర్శనం ఇస్తారు పరమాత్మ 

కాలు మీద కాలు వేసి రుద్దడం - దరిద్రం - అది దేవతలను అవమానించినట్టే .... అందుకే మన పెద్దవాళ్ళు కాలు మీద కాలు వేసి కడుక్కోవద్దు అని చెబుతుండేవారు 




Tuesday, December 10, 2013

శ్రీమద్భాగవతము - భాగము 76

శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 76


శ్రీకృష్ణుడు తండ్రితో ఇంద్రయాగం వద్దు గోవర్ధనగిరి యాగం చేయమని చెప్తారు

"కల్పము చెప్పటానికి ఏ బ్రహ్మ వస్తారు?" అని అడుగగా ఎవరూ రానవసరం లేదు ఆ యాగానికి ఏమేమి చేస్తారో దీనికి కూడా అవే చేయమని చెప్తారు 

యాగం చేసి అందరూ , ఆవులు , దూడలతో సహా కలిసి కూర్చుని భుజించి, గోవర్ధనగిరికి ప్రదక్షిణ చేసి , మిగిలిన పదార్ధాలు అన్నీ గోవర్ధనగిరికి సమర్పించమని చెప్తారు

మరుసటి రోజు అందరూ కలిసి అలాగే చేస్తారు...

గోవిందుడు వచ్చి ఆరగించటం చూసి సంతోషిస్తూ స్తోత్రాలు చేస్తూ ప్రదక్షిణ చేస్తుంటారు

ఆ కోలాహలం విన్న ఇంద్రుడు విషయం తెలిసి కోపంతో ఉరుములు , మెరుపులతో కూడిన వర్షం కురిపిస్తారు 

ఆ వర్షానికి ఆవులు,దూడలు భీతిల్లిపోయి కొన్ని చనిపోగా అందరూ కృష్ణుడిని వేడుకుంటారు 

వెంటనే కృష్ణుడు గోవర్ధనగిరి ఎత్తి పట్టుకుంటారు 

అలా 7 రాత్రులు 7 పగళ్ళు 7 ఏళ్ళ వయస్సులో తన చూపులతో పోషించారు 

" నేను బాలుడిని, ఇంత కొండ మొయ్యలేనేమో అని భయపడకండి, బంధువులారా.... రండి  కొండ క్రిందకు"  అని పిలిచారు 

ఇంద్రుడు అడిగారు "ఎరా...! ఎంతమంది పడ్డారు ?? " . సహచరుడు "ఒక్కరూ పడలేదు ... సుఖంగా ఉన్నారు ..." అని చెపుతాడు 

ఇంద్రుడికి అనుమానం వచ్చి వర్షాన్ని ఆపిస్తారు . పరమాత్మ దగ్గరకి వచ్చి చూసే సరికి దర్శనం ఇస్తారు 

ఇంద్రుడు "ఎంత పొరపాటయిపోయింది క్షమించమంటారు " 

ఐరావతం వచ్చి ఆకాశగంగను అభిషేకం చేసింది 

కామధేనువు వచ్చి "మేము ఇవ్వటం కాదు నువ్వు గెలుచుకున్నావు గోవులను సంరక్షించుకొనటం వలన "గోవిందా" అను పేరు" అని అంటుంది 

ఇంద్రుడి తల్లి వచ్చి ఇంద్రుడిని తిట్టి "ఆనాడు నిన్ను వామనమూర్తిలా వచ్చి కాపాడాడు ... ఈ రోజు నువ్వు చేసిన తప్పును క్షమించాడు .... అభిషేకం చెయ్యి" అని అంటుంది 

ఇంద్రుడు పాలతో అభిషేకం చేస్తారు...

కామధేనువు పాలను వర్షిస్తుంది... 




Saturday, August 24, 2013

శ్రీమద్భాగవతము - భాగము 75

శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 75


గోపికా వస్త్రాపహరణం

గోపికలు అందరూ కలిసి కృష్ణుడే భర్తగా పొందడానికి వ్రతం చేస్తున్నారు....

మార్గశిర మాసంలో కాత్యాయనీ వ్రతం చేసారు...

అందరూ కలిసి తెల్లవారుఝామున లేచి కాళింది నది/యమునా నదిలో స్నానానికి దిగారు.

కృష్ణుడు గోపికల బట్టలు తీసుకుని దగ్గర పెట్టుకొని చెట్టు ఎక్కుతారు...

కృష్ణుడికి గోపికలకు ఆడవారు స్నానం చేసేటప్పుడు ఏ విధులు పాటించాలో ఈ విధంగా బోధ చేస్తారు...

"మీరు బట్టలన్నీ విప్పి స్నానం చేయడం వల్ల కాత్యాయనీదేవియెడల దోషం వచ్చింది.. నేను చూడని వారా మీరు...నన్నే కదా భర్తగా పొందాలనుకుంటున్నారు..మీ భక్తికి లొంగి శిక్ష వేయకుండా ఉన్నాను.." అన్నారు పరమాత్మ.

** వ్రతం చేసేవారు ఒంటిమీద బట్టలు వేసుకునే స్నానం చెయ్యాలి **

పరమాత్మ వారితో "మీరు చేతులెత్తి నమస్కరించండి.. నేను మిమ్మల్ని అనుగ్రహించి, బట్టలు ఇస్తాను" అంటారు...

మొదట ఒప్పుకోక.. కాసేపటికి చలికి తట్టుకోలేక ఒక గోపిక చెప్పగా అందరూ చేతులెత్తి నమస్కరిస్తారు..

పరమాత్మ వారి వస్త్రములు ఇచ్చి, మీకు వ్రతఫలితాన్ని ఇస్తున్నాను... రాత్రులందు నన్ను పొందగలరు...

చీకటిలో ఈశ్వరుడిని పూజించటమంటే అజ్ఞానమును పారద్రోలటమే అని గుర్తు

గోవింద పట్టాభిషేకము

ఇంద్రుడు ఒకసారి కృష్ణుడేంటీ పరమాత్మ ఏంటి..? వర్షం, ఎండ అంతా నా ఆధీనం అని విర్రవీగుతాడు..

కృష్ణ పరమాత్మ అతడికి బుద్ధి చెప్పాలనుకుని ఇంద్రుడికై వర్షం కురవటానికి యజ్ఞం చేయదలచిన తండ్రి వద్దకు వెళతాడు..

Saturday, August 17, 2013

శ్రీమద్భాగవతము - భాగము 74


శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 74


కాళీయ మర్దనం ఉభయ సంధ్యల వేళ వినాలి...

అసుర సంధ్య వేళ కాళీయ మర్దనం వింటే పసుపు కుంకుమలు కలకాలం నిలబడతాయి...

కాళీయుని భార్యాపిల్లలు పతిభిక్ష పెట్టమని శరణువేడుకొనుట...

ఈశ్వరుడు ప్రసన్నమగుట....

కాళిందిని వదిలేసి భార్యా పిల్లలతో పాటు రమణక ద్వీపమునకు తిరిగి వెళ్ళమనుట....

అక్కడ గరుత్మంతుడు వారందిరిని ఏమి చేయకుండా ఉండేందుకు వారి తలలపై కృష్ణ పాదాలు ముద్రించుట....


తెలుగు మరియు సంస్కృత భాషలోని పదాల అర్థాలు తెసుకొనుటకు :

సంస్కృతం - అమరకము

తెలుగు  - శబ్దరత్నాకరము

రమణక ద్వీపము గురించి చెప్పారు :

ఆ మడుగులో ఉండే సర్పములన్నీ గరుత్మంతునికి బలిహరణం సమర్పించాలి...
అలా ఒకసారి కాళిందుని రోజు వస్తుంది... అతడు సమర్పించక పోగా యుద్ధం చేసి ఓడిపొతాడు...
అక్కడ నుంచి పారిపోయి సౌభరి తపస్సు చేసుకుంటున్న కాళింది మడుగులోకి వెళ్ళి దాక్కుంటాడు...

సౌభరి ఉన్నచోటుకి గరుత్మంతుడు రాడు.....

సౌభరి తండ్రి అయిన చేపను గరుత్మంతుడు తింటాడు అందుకు సౌభరి శపిస్తాడు ఇటువైపు వస్తే చంపుతానని...

ప్రలంభుడి వధ

కృష్ణ బలరాములు ఆడుకునే సమయంలో ప్రలంభుడు చంపడానికి వస్తే కృష్ణుడు అతడిని తన జట్టులోకి తీసుకుంటారు...

అప్పుడు కృష్ణుడి జట్టు ఓడిపోతుంది... అందుకు బలరాముని జట్టును కొంత దూరం మొయ్యాల్సి వస్తుంది...

ప్రలంభుడు బలరాముని మోస్తానని మొయ్యలేక రాక్షస రూపం దాలుస్తాడు...

ఎంత ఆగమన్నా ఆగకపోవడంతో తల బద్దలు కొట్టి చంపుతాడు బలరాముడు...

దేవాలయానికి వెళ్ళినప్పుడు 

  • ముఖ ద్వారం వద్ద చెయ్యి పెట్టి/తల వంచి నమస్కరించాలి....(చెప్పులతో దాటరాదు)
  • ధ్వజస్తంభం ప్రక్కన పరివార దేవతలను విస్మరించకూడదు...
  • రెండు చేతులతో నమస్కరించాలి...
  • దేవుడి ముందు వేరే వారి కాళ్ళకు నమస్కరించకూడదు...







Sunday, July 21, 2013

శ్రీమద్భాగవతము - భాగము 73


శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 73

భూసూక్తములో ఉండే పేర్లు ( భూమి మీద )

గార్ధభాసుర సంహారం ( ధేనుకాసుర వధ ) - బలరాముడు చంపుతారు

గోపబాలురు తాటిపండ్లు అడిగితే బలరాముడు గాడిదను చంపి వారికి తాటిపండ్లను ఇప్పిస్తారు
అప్పుడు గాడిద పిల్లలు వస్తే వారిని కూడా చంపుతారు...

కృష్ణుడు బలరాముని పిలిచి పొగిడి, సేవించి అతనిచేత చంపిస్తారు....

ప్రపంచంలో ప్రతీ జీవి (కుక్క, పక్షి, చెట్టు) పరోపకారం చేస్తూ వెళ్ళిపోతుంది ఒక్క మనిషి తప్ప...

** నీకో విషయం తెలుసు పది మందికి చెప్పు
    నీకు కొంత డబ్బు ఉంది పది మందికి పంచు **


అమ్మకు, భార్యకు థాంక్స్ చెప్పేవాడు, కొడుకుకి విషయాలు చెప్పని తండ్రి ఈ జాతికి బరువు....

గోవులు, గోపబాలురు కాళింది మడుగులో నీరు త్రాగి మరణిస్తారు...
కృష్ణుడి కరుణాదృష్టి వలన నిద్రలోంచి లేచినట్టు లేచి వస్తారు....

కృష్ణుడు ఏంతా చూద్దామని కాళింది మడుగులోకి దూకుతారు...
అలా దూకగానే కాళీయుడు కాటేస్తాడు....చుట్టేసుకుంటాడు...

కృష్ణుడు ఎవరెవరు ఏడుస్తారో చూడాలని చనిపోయినట్టు నటిస్తారు...
గోపికలు, యశోద అందరూ వచ్చి ఏడుస్తూ వరూ దూకడానికి సిద్ధమవుతారు... అప్పుడు కృష్ణుడు పెద్దగా పెరిగిపోతారు... ముక్కుల్లోంచి, నోట్లోనుంచి నెత్తురు కారుతుంది....
అందరూ ఆనందిస్తారు

కాళీయుడి పడగల మీద ఎక్కి నాట్యం చేస్తూ అతడిని చంపబోతారు.....
ఈలోగా కాళీయుని భార్య తన పిల్లలను వెంట పెట్టుకుని శరణు వేడుతుంది...

కాళీయుడు ఎటువంటి తపస్సు చేసాడో, మంచి చేసాడో నీ పాదాలు తన తలమీద పెట్టుకోగలిగారు అని అంటుంది...

Thursday, July 18, 2013

శ్రీమద్భాగవతము - భాగము 72


శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 72


చల్దులు ఏ విధంగా తింటున్నారో చెప్పారు...

కౌమార పౌగండ లీల - కౌమారములో జరిగిన లీల పౌగండమున చెప్పబడినది (గోప బాలుర చేత)

బ్రహ్మ దేవుడు గోవుల్ని, గోపాల బాలురను తన ఒక కనురెప్ప పాటు = ఒక సంవత్సరం పాటు మాయం చేయటం...

కృష్ణుడు తన రూపంలో ఆ సంవత్సరం పాటు గోవుల్ని, గోపాలకులను సృష్టించడం...

చతుర్ముఖ బ్రహ్మ స్తోత్రం చేయడం...

Wednesday, July 17, 2013

శ్రీమద్భాగవతము - భాగము 71


శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 71


అఘాసుర వధ
కొండచిలువ రూపంలో ఉన్న చీకటి అసురుడు - అఘాసురుడు

చల్దులారగించుట



Tuesday, July 2, 2013

శ్రీమద్భాగవతము - భాగము 70


శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 70

అమ్మకు అనుమానం రాకుండా చిన్నపిల్లవానిగా ప్రవర్తించటం...

బకాసుర వధ
వత్సాసుర వధ


కొంగ రూపంలో ఉన్న రాక్షసుడిని (బకాసురుని) వెలగ చెట్టుకు (వత్సాసురునికి) వేసి కొట్టడం....

గర్భిణీ స్త్రీలు...

Thursday, June 6, 2013

శ్రీమద్భాగవతము - భాగము 69

శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 69


యమలార్జన భంజనం

** ఈ లీల మరియు ఉలూకల బంధనం లీల ప్రతీరోజూ స్మరించుకుంటూ ఉండాలి...

తల్లి యశోద కట్టిన కట్లు విడిపించుకోవాలని బలంగా ఆ రోలు లాగితే ఆ 2 చెట్లలోంచి ఇద్దరు మహాపురుషులు వస్తారు...

వారు యక్షులు - వారే కుబేరుని కుమారులైన తలకూవర, మణిగ్రీవులు....

కుబేరుడు చాలా గొప్పవాడు... ఒక్కసారి మాత్రం అమ్మవారిని అమ్మ దృష్ఠితో కాక స్త్రీలాగా చూస్తారు... అందుకే మెల్ల కన్ను వస్తుంది...

కుబేరుడి కుమారులకు  నారదముని శాపం.... (నారదుల వారు పాట పాడుతూ మహతి మీటుతూ శపిస్తారు)

ఒకసారి వారు బట్టలు వేసుకోకుండా స్నానం చేస్తూ నారదమునికి నమస్కరించకపోవటంతో నందవ్రజంలో బట్టలు వేసుకునే అవసరంలేని మద్ది చెట్ల లాగా అవ్వమని ముని శపిస్తారు...

దేవుళ్ళు ఎందుకు కొండ మీదే ఉంటారు... ??

నిలబడిన చోట ఉన్న చెట్టు ఆకులు తుంపి నోట్లో పెట్టుకోవడం - పరమ దరిద్రం

రామకృష్ణ పరమహంస యజమాని నౌకరు కథ....

యజమాని ఒకసారి ఊరికి వెళ్తూ మొత్తం భోగాలను ఆ పెద్ద నౌకరును అనుభవించమనడం...
కానీ.., "ఇది నా యజమానిది" అని గుర్తుపెట్టుకో.... అక్కడే ఉన్న చాపలను మాత్రం పట్టకు అని చెప్పటం....

కొన్ని రోజులకు ఆ నౌకరు చాపలు పట్టబోవడం... యజమాని వచ్చి కట్టుబట్టలతో బయటకు నెట్టివేయడం...

ఈ కథలో యజమాని - దేవుడు..   చాపలు - భక్తులు...
అన్నీ అనుభవించు.... దేవుడిని తలుచుకో.... భక్తుల జోలికి వెళ్ళకు....

గర్భిణీ స్త్రీలు తప్పక వినవలసింది "దశమ స్కంధం"


Wednesday, June 5, 2013

Tuesday, June 4, 2013

Monday, May 27, 2013

శ్రీమద్భాగవతము - భాగము 62,63,64,65



శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 62,63,64,65

 

శివరాత్రి ఉత్సవములు/సంగీతం
 

Friday, May 17, 2013

శ్రీమద్భాగవతము - భాగము 61



శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 61

ఉలూకల బంధనం - గొప్ప లీల
గోవింద పట్టాభిషేకం కూడా దీని తర్వాతే......

అమ్మ తనకి పాలు ఇవ్వకుండా పొంగుతున్న పాల వద్దకు వెళ్ళిందన్న కోపంతో స్వామి పాలు,వెన్న కింద పారేసి.... మళ్ళీ అమ్మ కొడుతుంది అనుకుని ఠక ఠక వెన్న ముద్దలు తినేస్తూ.... రెండు ముద్దలు చేత పట్టుకుని పారిపోయారు....

ఒక గోపిక చూసి యశోద పట్టుకోలేదని అందరూ గోపికలు నవ్వడం...
వెనకపడి.... వెంటపడి... వెంటపడి.... ఆఖరికి స్వామి తనంతట తానే దొరికిపోవటం.....

దొరికాక కొట్టలేక కట్టేస్తానని యశోద అనటం....

"తల్లి లక్షణాలు చెప్పారు"
ఎంత కట్టివేయాలని చూసినా కట్టలేక 2 అంగుళములు తక్కువవడం గమనించలేదు యశోదమ్మ.....

ఆఖరికి గట్టిగా కడితే పొట్ట చుట్టూ నల్లటి మచ్చలు పడి "దామోదరా...!" అన్న పేరు వచ్చింది....

2 అంగుళములు తక్కువవడం....
పూజ మొక్కుబడిగా చేయటం....
నేను చేస్తున్నాను...? ఎందుకు చేస్తున్నానో మర్చిపోవటం...
అసలు "అథాంగ పూజ" ఎలా చేయాలో చెప్పారు....

పాము ఏ వేదం చదువుకుంది.....
సాలెపురుగు ఏ శాస్త్రం చదువుకుంది...
భగవంతుడు భక్తికి లొంగుతాడు....



Monday, May 13, 2013

శ్రీమద్భాగవతము - భాగము 60



శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 60


నందవ్రజంలో దుర్గమ్మ మరియు కృష్ణుడు ఇద్దరూ అర్థరాత్రి పుట్టారు......

లింగాభిషేకం చేసేప్పుడు కళ్ళు మూసుకుని ఎలా ధ్యానించాలి...?


శివలింగం చల్లగా ఉంటే లోకమంతా చల్లగా ఉంటుంది...

కృష్ణుడు మట్టి తినడం.....

"మన్ను తినంగ నేను శిశువునో....."

విశ్వరూప సందర్శనం

పరీక్షిత్తు అడుగుతాడు "నందుడు, యశోద ఏమి పుణ్యం/తపస్సు చేసారు అంత అదృష్టం పొందడానికి...? "


శుకుడు చెప్తాడు "వారు ఏమీ చెయ్యలేదు. కృష్ణుడు జన్మించబోతున్నాడని దేవతలలో తారా....ను భూలోకంలో జన్మించమంటారు"

Sunday, May 12, 2013

శ్రీమద్భాగవతము - భాగము 57,58,59




శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 57,58,59

 

మహాశివరాత్రి పూజలు

Tuesday, May 7, 2013

శ్రీమద్భాగవతము - భాగము 56***



శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 56


పోతనగారి ఫొటో ఒక్కటీ లేదు

అందరి ఇంటికి వెళ్ళి వెన్న, నెయ్యి తినేసి ఇంటికి వచ్చే ముందు మూతి తుడుచుకుని ఆకలి అంటూ వచ్చేవారు....

*** కృష్ణుడి చోరలీల ***

ఎప్పుడూ వెన్న, నెయ్యి మాత్రమే తింటారు

** వెన్నే ఎందుకు ?? **


నిర్మలమైన మనస్సు - పాలు
మనంతట మనం దేవునికి నిర్మలమైన మనస్సుతో పురాణాలు చదివి/విని దగ్గరవ్వాలి

పాలు అగ్ని మీద పెట్టి కాచాలి.....
మన నిర్మలమైన మనస్సును భక్తి వలన ఈశ్వర కైంకర్యం చేసి వైరాగ్య భావనతో ఉండాలి....

పెరుగు అవ్వాలంటే పెరుగునే తోడుగా వెయ్యాలి....
అంటే గురువు వద్దకు వచ్చి చెప్పమని అడగాలి.....

అప్పుడు పెరుగు తోడుకుంటుంది....
గురువు చేసిన ఉపదేశం చక్కగా కుండలో పెట్టినట్టు మనస్సులో పెట్టాలి.....

పెరుగు చిలికినట్టు గురువు చెప్పిన మాటలు
మనస్సులో మననం చేస్తునట్టు తిప్పాలి...

అలా తిప్పితే వచ్చేది వెన్న - Bookish Knowledge

దాన్ని అగ్నిహోత్రంలో పెట్టి కాస్తే వచ్చేదే నెయ్యి - అదే బ్రహ్మజ్ఞానాన్ని పొందవచ్చు

కానీ మరల నెయ్యి/వెన్నను పాలు చేయలేం...

దూడను తాగనీయకుండా మనమె పట్టేసుకుంటాం పాలు - ఎంత క్రౌర్యం

కృష్ణుడి గురించి అందరూ వచ్చి ఫిర్యాదులు చేయడం , నేరాలు చెప్పడం

కృష్ణ లీలలు - చోర లీల

ఏమి చెయ్యాలో ఎప్పుడు చెయ్యాలో ఏమి చేయకూడదో ఎప్పుడు చేయకూడదు అనేవి ఈ లీల ద్వారా తెలుస్తుంది.....

Wednesday, May 1, 2013

శ్రీమద్భాగవతము - భాగము 55

శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 55


అరుణాచలం వెళ్తేనే చాలు కోటి జన్మల పుణ్యం

అరుణాచలం - అగ్ని లింగం - శివరాత్రినాడు ఉద్భవించినది

తృణావర్తోపాఖ్యాణం

తృణము - తృష్ణ - తృప్తి

"తృప్తి ఉంటే తృష్ణ పట్టుకోలేదు మనల్ని"

***** తప్పక చదవవలిసిన భాగాలు *****
పోతనగారి భాగవతం
కృష్ణ కర్ణామృతం


కృష్ణుడి బుడిబుడి అడుగులు

Saturday, April 27, 2013

శ్రీమద్భాగవతము - భాగము 54



శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 54

 
బోర్ల పడిన చిన్ని కృష్ణుడు

అందరూ ఆనందంతో విందు చేసుకుంటుండగా బండిని తన్నిన చిన్ని కృష్ణుడు

షటకాసుర వృత్తాంతం

Friday, April 26, 2013

శ్రీమద్భాగవతము - భాగము 53



శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 53


కంసుడికి మరణం రాకూడదు అనే భయం పట్టుకోవడం....

పూతన సంహారం - పాలు ఇవ్వడానికి వచ్చి విషపు పాలు ఇవ్వడం

పూతన బాలఘాతకి  - తను చనిపోయాక కాలిస్తే సువాసన రావటం

Wednesday, April 24, 2013

శ్రీమద్భాగవతము - భాగము 52



శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 52


శ్రీకృష్ణుడి జననం

వసుదేవుడు బిడ్డని తీసుకెళ్ళి యశోదాదేవి వద్ద వదిలి, ఆడపిల్లను తీసుకురావడం....

తీరిన కోరికల వల్ల కలిగే సుఖము
                   +
తీరని కోరికల వల్ల కలిగే దు:ఖము
                   =
                జీవితం

Sunday, April 21, 2013

శ్రీమద్భాగవతము - భాగము 51***



శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 51


దశమ స్కంధం -- ఆయువుపట్టు
ప్రతి ఒక్కరు జీవితంలో వినవలసిన భాగం - దశమ స్కంధం

ఈ భాగంలో - 9:00నిమిషాల నుంచి - 10:30 నిమిషాల వరకు రామాయణం 2నిమిషాలలో చెప్పారు

నవమ స్కంధంలో రామాయణం చెప్పి దశమ స్కంధం ప్రారంభించారు


****** అనుమానం - పురాణం****** 

(ఏ అనుమానం వస్తే ఏ పురాణం చూడాలి)
రామాయణంలో సందేహం - పద్మ పురాణం
వెంకటేశ్వర స్వామి సందేహం - భవిష్యత్తు/వరాహ పురాణం
శివుని గురించి తెలుసుకోవాలంటే - స్కాంధ పురాణం
భాగవతంలో అనుమానం వస్తే - దేవీ భాగవతం

కంసుడికి ఉన్న పూర్వ జన్మ శాపం - ఇది దేవిభాగవతం అంతర్గతం


దేవకీ దేవి కడుపులో పుట్టిన 7గురికి ఉన్న శాపం

గర్భిణీ స్త్రీలకు వచ్చే వికారాలు, కోరికల గురించి పద్యం చెప్పారు... 

(ఆఖరి 2ని||లు)

Saturday, April 20, 2013

శ్రీమద్భాగవతము - భాగము 49 & 50




శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 49 &50

 

అంబరీషోపాఖ్యాణం
దూర్వాసుడు అంబరీషునికి శాపం పెట్టడం....
అంబరీషుడు సంవత్సరం పాటు ఏకాదశి వ్రతం చేసుకోవడం.....
ఏకాదశి వ్రతం చేసి దూర్వాసుడికి భోజనం పెడదామనుకోవడం....
అతడు ఆలస్యం చేసి ద్వాదశి తిథి వస్తుందనగా వస్తారు....
ఇంతలో అంబరీషుడు ఋషులని అడిగి నీరు పుచ్చుకోవడం....
అందుకు దూర్వాసుడికి కోపం వచ్చి జట తీసి అంబరీషుడి పైకి వదలటం....
వెంటనే అక్కడే శ్రీహరి కాపలా పెట్టిన సుదర్శన చక్రం దూర్వాసుడి వెంట పడటం...
దానితో ఆయన ముల్లోకాలు తిరగటం.... (ఇది అతనికి మావగారి శాపం)
అలా తిరిగి తిరిగి శ్రీహరి వద్దకు రావటం...
శ్రీహరి దూర్వాసుడిని అంబరీషునికి శరణాగతి చేయమనటం... అతడట్లే చేయటం...
అంబరీషుడు తన వల్ల ముని ఇంత కష్టపడాల్సి వచ్చిందని ఎంతో బాధపడి..... చక్రానికి శరణాగతి చేసి మునిని వదిలేయమని ప్రార్థిస్తారు....

కోడలిని ఎలా చూసుకోవాలో 50:00 నిమిషం వద్ద 5 నిమిషాల పాటు చెప్పారు...

దూర్వాసుడు గర్భంలో ఉన్నప్పుడు ఒక రాక్షసుడు పెట్టిన చికాకు వల్ల ఆయన పరమకోపంతో పుడతారు...
ఆ కోపాగ్నికి రాక్షసుడు భస్మం అవుతాడు... కానీ ఆ కోపాగ్ని అలాగే ఉండిపోతుంది...

దూర్వసుడికి మావగారి శాపం :

ఒకసారి దూర్వాసుడు ముని వద్దకు వెళ్ళి తన కుమార్తెను ఇమ్మని కోరతాడు...
అందుకు ఆ ముని "నీకు కోపం ఎక్కువ... నీకు కోపం వస్తే నా కూతురిని ఏదైనా చేస్తావు... ఇవ్వను" అంటారు.....

అలాక్కాదని ఒప్పించి వివాహమాడతారు...
ఒక రోజు ఎందుకో కోపం వచ్చి ఆమెని కన్నెర్ర చేసి చూస్తే ఆమె బూడిదయిపోతుంది...
వెంటనే ఆమెకు వరమిస్తాడు "నువ్వు ఎన్నటికీ అంతరించవు" అని
ఆమె అరటి చెట్టుగా పుడుతుంది...
తరువాత ఒక రోజు తండ్రి వచ్చి విషయం గ్రహించి శపిస్తారు.....

Friday, April 19, 2013

శ్రీమద్భాగవతము - భాగము 47 & 48




శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 47 & 48


వామనావతారం
అదితి - కశ్యపుల పుత్రుడు - వామనుడు

Thursday, April 18, 2013

శ్రీమద్భాగవతము - భాగము 46


శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 46


భార్యతో భర్త ప్రవర్తించే/ప్రవర్తించవలసిన తీరు............
నాయకత్వం ఆవశ్యకత...
శివునికి మోహిని గురించి ప్రమథగణాలు తెలుపుట....
శివుడు మోహినిని చూడదలుచుకోవటం...
శివుడు విష్ణువు వద్దకు వెళ్ళి మోహిని అవతారం చూపమనటం....
శివుడు మోహినిని చూడటం.... వెంటపడటం.... వీర్యం పడి వెండి, బంగారం అవటం....
శివకేశవులకు అయ్యప్పస్వామి జననం.........

Wednesday, April 17, 2013

శ్రీమద్భాగవతము - భాగము 45




శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 45

 

మోహిని రూపం........
అమృతం పంచిపెట్టడం.....

Tuesday, April 16, 2013

శ్రీమద్భాగవతము - భాగము 44


శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 44

 

"క్షీరాబ్ది కన్యకకు......" గానం

Sunday, April 14, 2013

Monday, April 1, 2013

శ్రీమద్భాగవతము - భాగము 42***



శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 42




లక్ష్మీ కళ్యాణం

నలుపు నాణ్యత

ఆడవారు కానీ, మగవారు కానీ లక్ష్మీ ఆవిర్భావం, లక్ష్మీ కళ్యాణం చదువుకుంటే చాలా మంచిది....

ముదివర్తి కొండమాచార్యులు గారు ద్విపద రాసారు .... అది చదివినా చాలు..

(చాగంటిగారి సైటులో ఉంది)

"పాలమున్నీటిలో....." 


తప్పక వినవలసిన భాగం --> లక్ష్మీ కళ్యాణం 

అందరూ అమ్మవారి తరుఫున ఉండి ఒక గడుసుపిల్ల స్వామిని ఏడిపిస్తే శివుని భార్య అయిన "పార్వతి" వచ్చి "మా తమ్ముడిని అంతమాట అంటావా....?" అంటూ ఎరుపు, నలుపు రంగుల గురించి చెప్తుంది...


Thursday, March 28, 2013

శ్రీమద్భాగవతము - భాగము 41 ***



శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 41



పాలసముద్రంలోంచి  లక్ష్మీ ఆవిర్భావం...


తప్పక వినవలసిన భాగం




Wednesday, March 27, 2013

శ్రీమద్భాగవతము - భాగము 40



శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 40



శివుణ్ణి విషం పుచ్చుకోమనడం....


హాలాహల భక్షణం విన్నవారికి పాములు, తేళ్ళు కుట్టవు 

 *కుట్టినా ఏమీ కాదు*

Monday, March 25, 2013

శ్రీమద్భాగవతము - భాగము 39 ***



శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 39




   ***************క్షీరసాగరమథనం*****************

తప్పక వినవలసిన భాగం

Friday, March 22, 2013

శ్రీమద్భాగవతము - భాగము 37 & 38





శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 37 & 38



ఏదైనా ఆపద వస్తే "వృత్రాసుర వృత్తాంతం" కాగితం మీద రాయమని చెప్తారు....

***   గజేంద్ర మోక్షము  ******

"గజేంద్ర మోక్షము" ఫలశ్రుతి చెప్పినది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే.....

"గజేంద్ర మోక్షము" పారాయణ చేస్తే చాలా మంచిది....

" కలడుకలండనెడివాడు కలడోలేడో....." -> అనుమానం ఉందనుకుని వెంటనే రాలేదు విష్ణువు....

Thursday, March 21, 2013

శ్రీమద్భాగవతము - భాగము 36



శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 36




ప్రహ్లాదోపాఖ్యాణం....

ప్రహ్లాదునికి అతని గురువులైన చండ, అమర్కులు ఏమి నేర్పుతున్నారో అని హిరణ్యకశ్యపుడి అనుమానం....

ప్రహ్లాదుడు రెండోసారి తండ్రి వద్దకు వెళ్ళి శ్రీహరి గురించే మాట్లాడటం....

"కమలాక్షునర్చించు కరములు కరములు... "

** నరసింహ అవతారం ** వివరణ......

ప్రహ్లాదునికి ఇచ్చిన వరం.....

ప్రహ్లాదుడు తండ్రి కొరకై అడిగిన వరం.....

ఈ ఘట్టం విన్నవారికి యమధర్మరాజు దర్శనం ఉండదు....

Wednesday, March 20, 2013

శ్రీమద్భాగవతము - భాగము 35



శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 35


హిరణ్యకశ్యపుడు తపస్సు చేసి బ్రహ్మ దగ్గర వరాలు పొందటం....

ఇంద్రలోకం వెళ్ళి దేవతలను ఓడించి ఇంద్రలోకం వశం చేసుకోవటం....

నారాయణుడిని సంహరించాలని ముల్లోకాలు గాలించడం...

విష్ణులోకం వెళ్ళి వెతికినా నారాయణుడు కనపడకపోవడం....

ప్రహ్లాదుని గొప్పతనం.....

Tuesday, March 19, 2013

శ్రీమద్భాగవతము - భాగము 34



శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 34



ఇంద్రుడు తనకు చుట్టుకున్న బ్రహ్మహత్యాపాతకాన్ని తొలగించుకోవటం....

వృత్రాసుర వధ...
వృత్రాసుర పూర్వజన్మ వృత్తాంతం...



Monday, March 18, 2013

శ్రీమద్భాగవతము - భాగము 33


శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 33


గురువుల యొక్క విశిష్టత.....

దేవతలు, రాక్షసుల మధ్య యుద్ధం....

ఇంద్రుడు గురువైన బృహస్పతిని అవమానిస్తే ఆయన సభను వదిలిపెట్టి వెళ్ళిపోవడం...

రాక్షసులకు గురువు ఆశీర్వాదం ఉంది...

దేవతలు ఓడిపోవడం...

ఇంద్రుడు దేవతలతో కలిసి బ్రహ్మగారి వద్దకు వెళ్ళి ఉపాయము తెలుపమనటం...

త్రష్ట ప్రజాపతి కుమారుడిని గురువుగా స్వీకరించమనటం....

ఇంద్రుడు గురు అనుగ్రహంతో నారాయణ కవచం పొందటం, రాక్షసులను ఓడించటం...

ఇంద్రుడు గురుహత్య చేయటం....బ్రహ్మహత్యాపాతకం చుట్టుకోవటం...

దానిని భూమి, చెట్టు, జలములు, స్త్రీ ఈ నలుగురు పుచ్చుకోవటం...

అందుకు వారికి ఒక్కో వరం ఇవ్వటం...

Thursday, March 14, 2013

శ్రీమద్భాగవతము - భాగము 32



శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 32




ఋషభుడి గురించి చెప్పారు.....

భరతుడి గురించి చెప్పారు.....

Wednesday, March 13, 2013

శ్రీమద్భాగవతము - భాగము 31



శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 31



స్వాయంభువు మనువు కుమారులు - ప్రియవ్రతుడు , ఉత్తనపాదుడు

ప్రియవ్రతుడి గురించి చెప్పారు...




Tuesday, March 12, 2013

శ్రీమద్భాగవతము - భాగము 30



శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 30





పృధు మహారాజు ఆఖ్యాణం - సంతానము లేనివారికి సంతానము కలిగే ఆఖ్యాణం...

భూమికి పృధివీ అనే పేరు ఎలా వచ్చింది..?

మానసిక పూజ చేసే విధానం చెప్పారు...


Monday, March 11, 2013

శ్రీమద్భాగవతము - భాగము 29




శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 29




పురంజనోపాఖ్యాణం

పృధు మహారాజు ఆఖ్యాణం - సంతానము లేనివారికి సంతానము కలిగే ఆఖ్యాణం...


Wednesday, March 6, 2013

Tuesday, March 5, 2013

శ్రీమద్భాగవతము - భాగము 26




శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 26



కర్దమ ప్రజాపతి దేవహూతికి సంతానం కలగడం...

9 మంది కుమార్తెలు, ఒక కుమారుడు కపిలుడు (విష్ణుమూర్తి అంశ) జన్మించడం...

9 మంది కుమార్తెలను 9 మంది ఋషులకు ఇచ్చి కన్యాదానం చేయడం...

కపిలుడు తల్లికి జ్ఞానం ప్రసాదించడం...

పూజావిధానం వివరించారు...

Monday, March 4, 2013

శ్రీమద్భాగవతము - భాగము 25




శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 25



కర్దమ ప్రజాపతి మంచి భార్య కోసం తపస్సు చేయడం....

పాణిగ్రహణ మంత్ర రహస్యం.... పాణిగ్రహణం చేసేప్పుడు చేతులు ఎలా పట్టుకుంటే ఎవరు పుడతారు....

స్వామి శ్రీమన్నారాయణుడు స్వాయంభువు మనువు కుమార్తె దేవహూతిని తీసుకు వస్తున్నాడు, తన కుమార్తెను నీకు ఇవ్వడానికి అడుగుతాడు అని వరం ఇవ్వడం.... 

ప్రజాపతికి స్వాయంభువ మనువుకు మధ్య జరిగే సంభాషణ.... (చాలా చక్కగా ఉంటుంది)

భార్యాభర్తల సంబంధం ఎలా ఉండాలి...?

భర్త తప:ఫలం భార్య...
భార్య నోములపంట భర్త....

ప్రజాపతి దేవహూతిని పెళ్ళి చేసుకోవడం... 
  

Friday, March 1, 2013

Thursday, February 28, 2013

శ్రీమద్భాగవతము - భాగము 23




శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 23


ధృవోపాఖ్యాణం 


సవతి తల్లి ధృవుడిని అనే మాటలు...

తల్లి ధృవుడితో చెప్పే మాటలు... తపస్సు చేయమనడం...

ధృవుడు తపస్సు చేయటానికి బయల్దేరటం...

నారదుడు ఆపి ధృవుడితో మాట్లాడటం...

Wednesday, February 27, 2013

శ్రీమద్భాగవతము - భాగము 22



శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 22


కృష్ణుడు ధర్మరాజు మొ||వారిని పితామహుని దగ్గరకు వెళ్ళి నీతి సూత్రములు, ధర్మం నేర్చుకోమని పంపడం...

భీష్ముడు కాలాన్ని స్తుతించడం....

భీష్మపితామహుడు కృష్ణుడిని స్తుతించడం...

తప్పక వినవలసిన భాగం....

**** శరీరాన్ని పులకింపజేసే భాగం ఇది ****

Tuesday, February 26, 2013

శ్రీమద్భాగవతము - భాగము 21



శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 21


భీష్మాచార్యులు

ఈ భాగములో క్రింది అంశాల గురించి ప్రస్తావించారు :

  • భీష్మ ప్రతిజ్ఞ
  • అంబ, అంబిక, అంబాలిక
  • అష్ట వసువులు
  • గంగ - 8 వ వసువు
  • దేవవ్రతుడు, గాంగేయుడు
  • యోజనగంధి
  • అంబ -> శిఖండి
  • అంబిక, అంబాలికలకు సంతానం కలిగించడం


భీష్ముడిని అన్ని బాణాలతో ఎందుకు కొట్టారు.... ??

భీష్ముడు "ద్రౌపది వస్త్రాపహరణం" నాడు ద్రౌపది ప్రశ్నకు ధర్మం తెలిసి చెప్పకపోవడం వలన అన్ని బాణాలు వేసి కొట్టవలసి వచ్చింది...

కృష్ణుడు ధనస్సు పట్టనని శపథం చేయడం... భీష్ముడు కృష్ణుడి చేత పట్టిస్తానని శపథం చేసి గెలవటం...

అంపశయ్య మీద ప్రాణం వదలకుండా ఉండటం.....

Monday, February 25, 2013

శ్రీమద్భాగవతము - భాగము 15 - 20



శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము


భాగము 15 - 20


వివిధ కార్యక్రమములు

20 - శ్రీ శ్రీ శ్రీ తత్వవిదానంద సరస్వతి స్వామివారి అనుగ్రహ భాషణం....

Friday, February 22, 2013

శ్రీమద్భాగవతము - భాగము 14




శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 14


దక్షుడు శివనింద చేసి కూడా ఎలాగైనా అతడికి ఖేదం కలిగించాలనుకోవడం...


దక్షయజ్ఞం.... శివపార్వతులను ఆహ్వానించకపోవటం.....

పార్వతి వెళతాననడం... శివుడు ఎంత చెప్పినా వినకపోవటం...

ఆఖరున సరే వెళ్ళమనటం.... వెళ్ళాక ఎవరూ పలకరించక, గౌరవించక పార్వతి ప్రాణత్యాగం చేయడం...

దక్షయజ్ఞ ధ్వంసం.....

Thursday, February 21, 2013

శ్రీమద్భాగవతము - భాగము 13




శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 13


యజ్ఞవరాహమూర్తి హిరణ్యాక్షుడిని సంహరించటం...

దక్షుడు శివుడిని నిందించటం...

Wednesday, February 20, 2013

శ్రీమద్భాగవతము - భాగము 12



శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 12


భూమి రసాతలంలో పడిపోవడం...


యజ్ఞవరాహమూర్తి ఆవిర్భావం....

ధృతి కశ్యపుల ఉత్తరసంధ్య మైథునం....

ధృతి తప్పు తెలుసుకుని 100 ఏళ్ళు కడుపులోనే బిడ్డలను ఉంచుకోవడం...

అందరూ చెప్పిన మీదట కనడం...

హిరణ్యాక్షుడు యజ్ఞవరాహమూర్తి చేతిలో సంహరింపబడటం...

వైకుంఠంలో 7వ ద్వారం ద్వారపాలకులైన జయవిజయులకు సనకసనందనాదుల శాపం...
మరియు విష్ణుమూర్తి శాపం....

వారే హిరణ్యాక్షుడు , హిరణ్యకశ్యపుడు...

Tuesday, February 19, 2013

శ్రీమద్భాగవతము - భాగము 11



శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 11


పరీక్షిత్తు అంటారు "పాము చేతిలో చనిపోవడానికి నేను సిద్ధమే... నేనేమీ మంటలు పెట్టో.. కాపలా పెట్టో ఆపను... ఈశ్వర సంకల్పం నేడు మారదు...!" 

I Accept The Death

"భవిష్యత్తు జన్మలలో హరినే ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉండాలి..."

గురువు యొక్క విశిష్టత...

విశ్వనాథ సత్యనారాయణగారు అంటారు :

తిన్న అన్నం తినట్లేదా...
చేసిన సంసారం చేయట్లేదా...
చదివిన భాగవతం చదవడానికి
నీకేమి నొప్పి....??


Friday, February 15, 2013

శ్రీమద్భాగవతము - భాగము 9 & 10



శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 9 & 10


పరీక్షిత్తు పరిపాలన..

ఆవు ఏడవడం...

పరీక్షిత్తు బంగారంలోకి కలి ప్రవేశం... కలి పురుషుడు ఎలా విస్తరిస్తాడు...


పరీక్షిత్తు వేటకని వెళ్ళి దాహమేస్తే ముని ఆశ్రమానికి వెళ్ళి ముని తపస్సులో ఉండి పలుకకపొతే చచ్చిన పామును మెడలో వేయడం...

మునికుమారుడు(శృంగి)7వ రోజున ఆ రాజు తక్షకుడి చేతిలో చస్తాడని శపించటం...

పరీక్షిత్తు గంగ ఒడ్డుకు చేరి ఆత్మాహుతికి పాల్పడగా ఎందరో ఋషులు (వశిష్ట, విశ్వామిత్ర, గౌతమ, అగస్త్యాదులు)  ఆ దృశ్యాన్ని చూడటానికి రావడం...

ఇంతలో శుకమహర్షి అక్కడకు వచ్చి నేను నీకు మహాభారతం చెప్తాను అనడం...

శుకుని ప్రత్యేకత : ఆవు పాలు పితికిన కంటే ఎక్కువసేపు ఎక్కడా ఉండకపోవటం..


Thursday, February 14, 2013

శ్రీమద్భాగవతము - భాగము 8



శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము


భాగము 8


కృష్ణ నిర్యాణం

విదురుడు ధృతరాష్ట్రుడిని ఉత్తర దిశకు ప్రయాణం కమ్మనడం..

ధృతరాష్ట్రుడు, గాంధారి నిర్యాణం...

ధర్మరాజు నారదుల ద్వారా ఈ విషయం తెలుసుకుని పరీక్షిత్తుకి పట్టభిషేకం చేసి పాండవులతో కలిసి నిర్యాణం చెందడం..

Wednesday, February 13, 2013

శ్రీమద్భాగవతము - భాగము 7



శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 7


క్రిందటి రోజున ఉత్తరా గర్భమునందున్న పరీక్షిత్తును రక్షించమని కృష్ణుడిని స్తోత్రం చేసి అర్థిస్తే... కృష్ణుడు రక్షిస్తారు...

ఇంటి పెద్దకు ఉండవలసిన లక్షణం....
కుంతీ కృష్ణుడిని స్తోత్రం చేయడం....

Tuesday, February 12, 2013

శ్రీమద్భాగవతము - భాగము 6



శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 6

ద్రౌపది అశ్వథ్థామను చూసి "ఎలా చంపబుద్ధి అయ్యింది పిల్లలని" అని అడిగి అర్జునుడితో 
"అర్జునా..! ద్రోణాచార్యుని భార్య(గురుపత్ని)కి ఈ పాటికి ఈ విషయం తెలిసి ఉంటుంది.. ఆమె ఎంత దు:ఖిస్తుందో ...! ఈతడిని వదిలెయ్యి" అంటుంది

భీముడికి కోపం వస్తే కృష్ణుడు ఆపి "అతడు 'ఆతతాయి' కాబట్టి చంపు.... బ్రాహ్మణుడు కాబట్టి చంపకు" అంటారు.

గుండు గీసేస్తే బ్రాహ్మణుడు చనిపోయిన వానితో సమానం.... అతడట్లే చేస్తాడు...

Monday, February 11, 2013

శ్రీమద్భాగవతము - భాగము 5


శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 5
సూతమహాముని నైమిశారణ్యమునకు వస్తే భాగవతము చెప్పమని అర్థించడం...
'భగవత్' శబ్దము యొక్క గొప్పించడం...

పోతనగారు సహజ పండితుడు..

పండా :- భక్తుడికి భగవంతుడి యొక్క నిర్హేతుకమైన కృప కలిగినటువంటి వాడు...

సత్వగుణం :- ఇంటికి తీసుకెళ్ళదు, దారి చూపిస్తుంది...

16 కళలచేత నిండియున్నాడు ఈశ్వరుడు...

జ్ఞానేంద్రియములు - 5
కర్మేందియములు - 5
అంత:కరణము  - 1
పంచభూతములు - 5
మొత్తం 16

లక్ష్మీ కళ్యాణం - చదివితే కొన్ని కోట్ల జన్మల వల్ల వచ్చిన పాపం నశించబడుతుంది...

వామనమూర్తి కథ - వింటే ఇళ్ళల్లో జరిగిన కార్యక్రమములు సంపూర్ణంగా చేయకపోయినా చేసినంత ఫలితాన్ని ఇస్తుంది....

వ్యాసుడు చెప్పిన 22 అవతారములు

కట్టె - పృథివీ
పొగ పృథివీ వికారము
ఆకాశము నిర్వికారము

అశ్వథ్థామ కౌరవులను పాండవులు చంపుతున్నారని రాత్రిపూట వెళ్ళి ఉపపాండవులను చంపుతారు...

అర్జునుడు ఆ పని ఎవరుచేయ సమర్థులో తెలుసుకుని ఏడుస్తున్న ద్రౌపది వద్దకు వెళ్ళి "ఏడవద్దు అతడి తల పట్టుకుని ఈడ్చుకొస్తాను... నువ్వు కాలితో తన్నమంటాడు"

అర్జునుడు అతడిని చంపడానికి బయలుదేరితే అశ్వథ్థామ బ్రహ్మాస్త్రం వదులుతారు...
కానీ, అతడికి వెనక్కి తీసుకోవడం రాకపొతే కృష్ణుడు అర్జునుడికి బ్రహ్మాస్త్రం వదలమంటారు..
ఇప్పుడు రెండింటిని ఉపసంహరించమంటారు...

కృష్ణ భగవానులు చంపమని చెప్పినా అతడు చంపకుండా ద్రౌపది వద్దకు తెస్తాడు...

Sunday, February 10, 2013

శ్రీమద్భాగవతము - భాగము 4



శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 4

పదిమంది రాక్షసులను పుట్టించారు
అమ్మవారి గోళ్ళలోంచి దశావతారాలు వచ్చాయి....

పోతనగారి ఇంటికి సరస్వతీ అమ్మవారు గజ్జలు కట్టుకుని వచ్చి ఏడుస్తూ కనిపిస్తారు...
అప్పుడు పోతనగారు ఈ కవిత్వం(సరస్వతి అమ్మవారి స్వరూపమైన విద్యను) ఎవరికీ అమ్మను అని మాట ఇస్తారు... 

అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్ముల మూలపుటమ్మ 
చాల పెద్దమ్మ సురారులమ్మ....

కైలము - ఆనందముల సమూహము
కైలాసము - ఆనందమయ ప్రదేశము

* అక్షరాభ్యాసము తరువాత పిల్లలకి నేర్పించవలసిన శారదాదేవి మీద పద్యము
* 11 సరస్వతీ దేవి మహామంత్రములు 
* అమ్మవారిని ఒక్కో రూపంగా కొలవచ్చు
ఎరుపు రంగు సరస్వతి / తెలుపు రంగు సరస్వతి

శారద నీరదేంద్రు ఘనసార పటీర మరాళ మల్లికాహార........
..................................................................................
................ నిన్ను మది నెన్నడు కానగా కలుగు భారతీ...!!