Saturday, April 20, 2013

శ్రీమద్భాగవతము - భాగము 49 & 50




శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 49 &50

 

అంబరీషోపాఖ్యాణం
దూర్వాసుడు అంబరీషునికి శాపం పెట్టడం....
అంబరీషుడు సంవత్సరం పాటు ఏకాదశి వ్రతం చేసుకోవడం.....
ఏకాదశి వ్రతం చేసి దూర్వాసుడికి భోజనం పెడదామనుకోవడం....
అతడు ఆలస్యం చేసి ద్వాదశి తిథి వస్తుందనగా వస్తారు....
ఇంతలో అంబరీషుడు ఋషులని అడిగి నీరు పుచ్చుకోవడం....
అందుకు దూర్వాసుడికి కోపం వచ్చి జట తీసి అంబరీషుడి పైకి వదలటం....
వెంటనే అక్కడే శ్రీహరి కాపలా పెట్టిన సుదర్శన చక్రం దూర్వాసుడి వెంట పడటం...
దానితో ఆయన ముల్లోకాలు తిరగటం.... (ఇది అతనికి మావగారి శాపం)
అలా తిరిగి తిరిగి శ్రీహరి వద్దకు రావటం...
శ్రీహరి దూర్వాసుడిని అంబరీషునికి శరణాగతి చేయమనటం... అతడట్లే చేయటం...
అంబరీషుడు తన వల్ల ముని ఇంత కష్టపడాల్సి వచ్చిందని ఎంతో బాధపడి..... చక్రానికి శరణాగతి చేసి మునిని వదిలేయమని ప్రార్థిస్తారు....

కోడలిని ఎలా చూసుకోవాలో 50:00 నిమిషం వద్ద 5 నిమిషాల పాటు చెప్పారు...

దూర్వాసుడు గర్భంలో ఉన్నప్పుడు ఒక రాక్షసుడు పెట్టిన చికాకు వల్ల ఆయన పరమకోపంతో పుడతారు...
ఆ కోపాగ్నికి రాక్షసుడు భస్మం అవుతాడు... కానీ ఆ కోపాగ్ని అలాగే ఉండిపోతుంది...

దూర్వసుడికి మావగారి శాపం :

ఒకసారి దూర్వాసుడు ముని వద్దకు వెళ్ళి తన కుమార్తెను ఇమ్మని కోరతాడు...
అందుకు ఆ ముని "నీకు కోపం ఎక్కువ... నీకు కోపం వస్తే నా కూతురిని ఏదైనా చేస్తావు... ఇవ్వను" అంటారు.....

అలాక్కాదని ఒప్పించి వివాహమాడతారు...
ఒక రోజు ఎందుకో కోపం వచ్చి ఆమెని కన్నెర్ర చేసి చూస్తే ఆమె బూడిదయిపోతుంది...
వెంటనే ఆమెకు వరమిస్తాడు "నువ్వు ఎన్నటికీ అంతరించవు" అని
ఆమె అరటి చెట్టుగా పుడుతుంది...
తరువాత ఒక రోజు తండ్రి వచ్చి విషయం గ్రహించి శపిస్తారు.....

No comments:

Post a Comment