Thursday, February 28, 2013

శ్రీమద్భాగవతము - భాగము 23




శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 23


ధృవోపాఖ్యాణం 


సవతి తల్లి ధృవుడిని అనే మాటలు...

తల్లి ధృవుడితో చెప్పే మాటలు... తపస్సు చేయమనడం...

ధృవుడు తపస్సు చేయటానికి బయల్దేరటం...

నారదుడు ఆపి ధృవుడితో మాట్లాడటం...

Wednesday, February 27, 2013

శ్రీమద్భాగవతము - భాగము 22



శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 22


కృష్ణుడు ధర్మరాజు మొ||వారిని పితామహుని దగ్గరకు వెళ్ళి నీతి సూత్రములు, ధర్మం నేర్చుకోమని పంపడం...

భీష్ముడు కాలాన్ని స్తుతించడం....

భీష్మపితామహుడు కృష్ణుడిని స్తుతించడం...

తప్పక వినవలసిన భాగం....

**** శరీరాన్ని పులకింపజేసే భాగం ఇది ****

Tuesday, February 26, 2013

శ్రీమద్భాగవతము - భాగము 21



శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 21


భీష్మాచార్యులు

ఈ భాగములో క్రింది అంశాల గురించి ప్రస్తావించారు :

  • భీష్మ ప్రతిజ్ఞ
  • అంబ, అంబిక, అంబాలిక
  • అష్ట వసువులు
  • గంగ - 8 వ వసువు
  • దేవవ్రతుడు, గాంగేయుడు
  • యోజనగంధి
  • అంబ -> శిఖండి
  • అంబిక, అంబాలికలకు సంతానం కలిగించడం


భీష్ముడిని అన్ని బాణాలతో ఎందుకు కొట్టారు.... ??

భీష్ముడు "ద్రౌపది వస్త్రాపహరణం" నాడు ద్రౌపది ప్రశ్నకు ధర్మం తెలిసి చెప్పకపోవడం వలన అన్ని బాణాలు వేసి కొట్టవలసి వచ్చింది...

కృష్ణుడు ధనస్సు పట్టనని శపథం చేయడం... భీష్ముడు కృష్ణుడి చేత పట్టిస్తానని శపథం చేసి గెలవటం...

అంపశయ్య మీద ప్రాణం వదలకుండా ఉండటం.....

Monday, February 25, 2013

శ్రీమద్భాగవతము - భాగము 15 - 20



శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము


భాగము 15 - 20


వివిధ కార్యక్రమములు

20 - శ్రీ శ్రీ శ్రీ తత్వవిదానంద సరస్వతి స్వామివారి అనుగ్రహ భాషణం....

Friday, February 22, 2013

శ్రీమద్భాగవతము - భాగము 14




శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 14


దక్షుడు శివనింద చేసి కూడా ఎలాగైనా అతడికి ఖేదం కలిగించాలనుకోవడం...


దక్షయజ్ఞం.... శివపార్వతులను ఆహ్వానించకపోవటం.....

పార్వతి వెళతాననడం... శివుడు ఎంత చెప్పినా వినకపోవటం...

ఆఖరున సరే వెళ్ళమనటం.... వెళ్ళాక ఎవరూ పలకరించక, గౌరవించక పార్వతి ప్రాణత్యాగం చేయడం...

దక్షయజ్ఞ ధ్వంసం.....

Thursday, February 21, 2013

శ్రీమద్భాగవతము - భాగము 13




శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 13


యజ్ఞవరాహమూర్తి హిరణ్యాక్షుడిని సంహరించటం...

దక్షుడు శివుడిని నిందించటం...

Wednesday, February 20, 2013

శ్రీమద్భాగవతము - భాగము 12



శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 12


భూమి రసాతలంలో పడిపోవడం...


యజ్ఞవరాహమూర్తి ఆవిర్భావం....

ధృతి కశ్యపుల ఉత్తరసంధ్య మైథునం....

ధృతి తప్పు తెలుసుకుని 100 ఏళ్ళు కడుపులోనే బిడ్డలను ఉంచుకోవడం...

అందరూ చెప్పిన మీదట కనడం...

హిరణ్యాక్షుడు యజ్ఞవరాహమూర్తి చేతిలో సంహరింపబడటం...

వైకుంఠంలో 7వ ద్వారం ద్వారపాలకులైన జయవిజయులకు సనకసనందనాదుల శాపం...
మరియు విష్ణుమూర్తి శాపం....

వారే హిరణ్యాక్షుడు , హిరణ్యకశ్యపుడు...

Tuesday, February 19, 2013

శ్రీమద్భాగవతము - భాగము 11



శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 11


పరీక్షిత్తు అంటారు "పాము చేతిలో చనిపోవడానికి నేను సిద్ధమే... నేనేమీ మంటలు పెట్టో.. కాపలా పెట్టో ఆపను... ఈశ్వర సంకల్పం నేడు మారదు...!" 

I Accept The Death

"భవిష్యత్తు జన్మలలో హరినే ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉండాలి..."

గురువు యొక్క విశిష్టత...

విశ్వనాథ సత్యనారాయణగారు అంటారు :

తిన్న అన్నం తినట్లేదా...
చేసిన సంసారం చేయట్లేదా...
చదివిన భాగవతం చదవడానికి
నీకేమి నొప్పి....??


Friday, February 15, 2013

శ్రీమద్భాగవతము - భాగము 9 & 10



శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 9 & 10


పరీక్షిత్తు పరిపాలన..

ఆవు ఏడవడం...

పరీక్షిత్తు బంగారంలోకి కలి ప్రవేశం... కలి పురుషుడు ఎలా విస్తరిస్తాడు...


పరీక్షిత్తు వేటకని వెళ్ళి దాహమేస్తే ముని ఆశ్రమానికి వెళ్ళి ముని తపస్సులో ఉండి పలుకకపొతే చచ్చిన పామును మెడలో వేయడం...

మునికుమారుడు(శృంగి)7వ రోజున ఆ రాజు తక్షకుడి చేతిలో చస్తాడని శపించటం...

పరీక్షిత్తు గంగ ఒడ్డుకు చేరి ఆత్మాహుతికి పాల్పడగా ఎందరో ఋషులు (వశిష్ట, విశ్వామిత్ర, గౌతమ, అగస్త్యాదులు)  ఆ దృశ్యాన్ని చూడటానికి రావడం...

ఇంతలో శుకమహర్షి అక్కడకు వచ్చి నేను నీకు మహాభారతం చెప్తాను అనడం...

శుకుని ప్రత్యేకత : ఆవు పాలు పితికిన కంటే ఎక్కువసేపు ఎక్కడా ఉండకపోవటం..


Thursday, February 14, 2013

శ్రీమద్భాగవతము - భాగము 8



శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము


భాగము 8


కృష్ణ నిర్యాణం

విదురుడు ధృతరాష్ట్రుడిని ఉత్తర దిశకు ప్రయాణం కమ్మనడం..

ధృతరాష్ట్రుడు, గాంధారి నిర్యాణం...

ధర్మరాజు నారదుల ద్వారా ఈ విషయం తెలుసుకుని పరీక్షిత్తుకి పట్టభిషేకం చేసి పాండవులతో కలిసి నిర్యాణం చెందడం..

Wednesday, February 13, 2013

శ్రీమద్భాగవతము - భాగము 7



శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 7


క్రిందటి రోజున ఉత్తరా గర్భమునందున్న పరీక్షిత్తును రక్షించమని కృష్ణుడిని స్తోత్రం చేసి అర్థిస్తే... కృష్ణుడు రక్షిస్తారు...

ఇంటి పెద్దకు ఉండవలసిన లక్షణం....
కుంతీ కృష్ణుడిని స్తోత్రం చేయడం....

Tuesday, February 12, 2013

శ్రీమద్భాగవతము - భాగము 6



శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 6

ద్రౌపది అశ్వథ్థామను చూసి "ఎలా చంపబుద్ధి అయ్యింది పిల్లలని" అని అడిగి అర్జునుడితో 
"అర్జునా..! ద్రోణాచార్యుని భార్య(గురుపత్ని)కి ఈ పాటికి ఈ విషయం తెలిసి ఉంటుంది.. ఆమె ఎంత దు:ఖిస్తుందో ...! ఈతడిని వదిలెయ్యి" అంటుంది

భీముడికి కోపం వస్తే కృష్ణుడు ఆపి "అతడు 'ఆతతాయి' కాబట్టి చంపు.... బ్రాహ్మణుడు కాబట్టి చంపకు" అంటారు.

గుండు గీసేస్తే బ్రాహ్మణుడు చనిపోయిన వానితో సమానం.... అతడట్లే చేస్తాడు...

Monday, February 11, 2013

శ్రీమద్భాగవతము - భాగము 5


శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 5
సూతమహాముని నైమిశారణ్యమునకు వస్తే భాగవతము చెప్పమని అర్థించడం...
'భగవత్' శబ్దము యొక్క గొప్పించడం...

పోతనగారు సహజ పండితుడు..

పండా :- భక్తుడికి భగవంతుడి యొక్క నిర్హేతుకమైన కృప కలిగినటువంటి వాడు...

సత్వగుణం :- ఇంటికి తీసుకెళ్ళదు, దారి చూపిస్తుంది...

16 కళలచేత నిండియున్నాడు ఈశ్వరుడు...

జ్ఞానేంద్రియములు - 5
కర్మేందియములు - 5
అంత:కరణము  - 1
పంచభూతములు - 5
మొత్తం 16

లక్ష్మీ కళ్యాణం - చదివితే కొన్ని కోట్ల జన్మల వల్ల వచ్చిన పాపం నశించబడుతుంది...

వామనమూర్తి కథ - వింటే ఇళ్ళల్లో జరిగిన కార్యక్రమములు సంపూర్ణంగా చేయకపోయినా చేసినంత ఫలితాన్ని ఇస్తుంది....

వ్యాసుడు చెప్పిన 22 అవతారములు

కట్టె - పృథివీ
పొగ పృథివీ వికారము
ఆకాశము నిర్వికారము

అశ్వథ్థామ కౌరవులను పాండవులు చంపుతున్నారని రాత్రిపూట వెళ్ళి ఉపపాండవులను చంపుతారు...

అర్జునుడు ఆ పని ఎవరుచేయ సమర్థులో తెలుసుకుని ఏడుస్తున్న ద్రౌపది వద్దకు వెళ్ళి "ఏడవద్దు అతడి తల పట్టుకుని ఈడ్చుకొస్తాను... నువ్వు కాలితో తన్నమంటాడు"

అర్జునుడు అతడిని చంపడానికి బయలుదేరితే అశ్వథ్థామ బ్రహ్మాస్త్రం వదులుతారు...
కానీ, అతడికి వెనక్కి తీసుకోవడం రాకపొతే కృష్ణుడు అర్జునుడికి బ్రహ్మాస్త్రం వదలమంటారు..
ఇప్పుడు రెండింటిని ఉపసంహరించమంటారు...

కృష్ణ భగవానులు చంపమని చెప్పినా అతడు చంపకుండా ద్రౌపది వద్దకు తెస్తాడు...

Sunday, February 10, 2013

శ్రీమద్భాగవతము - భాగము 4



శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 4

పదిమంది రాక్షసులను పుట్టించారు
అమ్మవారి గోళ్ళలోంచి దశావతారాలు వచ్చాయి....

పోతనగారి ఇంటికి సరస్వతీ అమ్మవారు గజ్జలు కట్టుకుని వచ్చి ఏడుస్తూ కనిపిస్తారు...
అప్పుడు పోతనగారు ఈ కవిత్వం(సరస్వతి అమ్మవారి స్వరూపమైన విద్యను) ఎవరికీ అమ్మను అని మాట ఇస్తారు... 

అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్ముల మూలపుటమ్మ 
చాల పెద్దమ్మ సురారులమ్మ....

కైలము - ఆనందముల సమూహము
కైలాసము - ఆనందమయ ప్రదేశము

* అక్షరాభ్యాసము తరువాత పిల్లలకి నేర్పించవలసిన శారదాదేవి మీద పద్యము
* 11 సరస్వతీ దేవి మహామంత్రములు 
* అమ్మవారిని ఒక్కో రూపంగా కొలవచ్చు
ఎరుపు రంగు సరస్వతి / తెలుపు రంగు సరస్వతి

శారద నీరదేంద్రు ఘనసార పటీర మరాళ మల్లికాహార........
..................................................................................
................ నిన్ను మది నెన్నడు కానగా కలుగు భారతీ...!!

శ్రీమద్భాగవతము భాగము 1,2,3



శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము


భాగము 1,2
ప్రారంభ వాక్యములు

భాగము 3
ముందుమాట
శుకబ్రహ్మ గురించి చెప్పారు
పోతనగారి గొప్పతనం


పలికెడిది భాగవతమట
పలికించు విభుండు రామభద్రుండట
నే పలికిన భవహరమగునట
పలికెద వేరొక గాధ పలుకగనేల...

ధర్మము మారుతుంది
సత్యము మారనిది

Tuesday, February 5, 2013

శ్రీ చాగంటి గారి ప్రవచనముల సూచిక - ముఖ్య ఉద్దేశ్యం..


శ్రీ చాగంటి గారి ప్రవచనముల సూచిక - ముఖ్య ఉద్దేశ్యం..


శ్రీ చాగంటి గారి ప్రవచనములు అందరం వింటాము... విన్నప్పుడు బాగానే గుర్తుంటాయి... కానీ, కొన్ని రోజుల తర్వాత గుర్తుతెచ్చుకుందామంటే గుర్తు రావు...

ఉదా: శ్రీమద్భాగవతములో  'గజేంద్ర మోక్షము ' ఎంత బాగా చెప్పారో కదా అనుకుంటాము... మరొక్కసారి వినాలి అంటే ఆ 120 భాగాలలో ఎన్నో భాగమో గుర్తు రాదు... అందుకొరకే ఈ బ్లాగు వ్రాయడం జరిగింది....

ఈ బ్లాగు 'చాగంటి కోటేశ్వర రావు' గారి అమృత ప్రవచనముల సూచిక లాగా మనందరికి ఉపయోగపడుతుంది...

ఈ నా ప్రయత్నం లో పాలుపంచుకోవడానికి ఎవరైనా ముందుకొస్తే తప్పక వారిని ఈ బ్లాగులోకి చేర్చుకోవడం జరుగుతుంది...

మీరు చేయవలసిందల్లా ఒక్కటే... మీరు ప్రవచనములను వినేటప్పుడు

ఫ్రవచనం పేరు - ఎన్నో భాగము - అందులో చెప్పిన వాటి ముఖ్యాంశములు... ఈ బ్లాగులో పోస్టు లాగా వ్రాయటమే...