Saturday, August 17, 2013

శ్రీమద్భాగవతము - భాగము 74


శ్రీ చాగంటి గారి ప్రవచనములు  - శ్రీమద్భాగవతము

భాగము 74


కాళీయ మర్దనం ఉభయ సంధ్యల వేళ వినాలి...

అసుర సంధ్య వేళ కాళీయ మర్దనం వింటే పసుపు కుంకుమలు కలకాలం నిలబడతాయి...

కాళీయుని భార్యాపిల్లలు పతిభిక్ష పెట్టమని శరణువేడుకొనుట...

ఈశ్వరుడు ప్రసన్నమగుట....

కాళిందిని వదిలేసి భార్యా పిల్లలతో పాటు రమణక ద్వీపమునకు తిరిగి వెళ్ళమనుట....

అక్కడ గరుత్మంతుడు వారందిరిని ఏమి చేయకుండా ఉండేందుకు వారి తలలపై కృష్ణ పాదాలు ముద్రించుట....


తెలుగు మరియు సంస్కృత భాషలోని పదాల అర్థాలు తెసుకొనుటకు :

సంస్కృతం - అమరకము

తెలుగు  - శబ్దరత్నాకరము

రమణక ద్వీపము గురించి చెప్పారు :

ఆ మడుగులో ఉండే సర్పములన్నీ గరుత్మంతునికి బలిహరణం సమర్పించాలి...
అలా ఒకసారి కాళిందుని రోజు వస్తుంది... అతడు సమర్పించక పోగా యుద్ధం చేసి ఓడిపొతాడు...
అక్కడ నుంచి పారిపోయి సౌభరి తపస్సు చేసుకుంటున్న కాళింది మడుగులోకి వెళ్ళి దాక్కుంటాడు...

సౌభరి ఉన్నచోటుకి గరుత్మంతుడు రాడు.....

సౌభరి తండ్రి అయిన చేపను గరుత్మంతుడు తింటాడు అందుకు సౌభరి శపిస్తాడు ఇటువైపు వస్తే చంపుతానని...

ప్రలంభుడి వధ

కృష్ణ బలరాములు ఆడుకునే సమయంలో ప్రలంభుడు చంపడానికి వస్తే కృష్ణుడు అతడిని తన జట్టులోకి తీసుకుంటారు...

అప్పుడు కృష్ణుడి జట్టు ఓడిపోతుంది... అందుకు బలరాముని జట్టును కొంత దూరం మొయ్యాల్సి వస్తుంది...

ప్రలంభుడు బలరాముని మోస్తానని మొయ్యలేక రాక్షస రూపం దాలుస్తాడు...

ఎంత ఆగమన్నా ఆగకపోవడంతో తల బద్దలు కొట్టి చంపుతాడు బలరాముడు...

దేవాలయానికి వెళ్ళినప్పుడు 

  • ముఖ ద్వారం వద్ద చెయ్యి పెట్టి/తల వంచి నమస్కరించాలి....(చెప్పులతో దాటరాదు)
  • ధ్వజస్తంభం ప్రక్కన పరివార దేవతలను విస్మరించకూడదు...
  • రెండు చేతులతో నమస్కరించాలి...
  • దేవుడి ముందు వేరే వారి కాళ్ళకు నమస్కరించకూడదు...







No comments:

Post a Comment